You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
Type: Print Book
Genre: Literature & Fiction, Romance
Language: Telugu
Price: ₹369 + shipping
Price: ₹369 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

ఎలాగన్నా ఐ ఏ ఎస్ అవ్వాలన్న లక్ష్యం తో వున్న, రీసెంట్ గా తల్లీతండ్రీ గతించిన అనిరుధ్, అదే లక్ష్యం తో వున్న తన ఫ్రెండ్ మనోజ్ తో కలిసి కంబైన్డ్ స్టడీ కూడా చేస్తూ కష్టపడుతూ వున్నాడు. ఆ సమయం లో ఆ వూళ్ళో వున్న, ఆ ఊళ్లోనూ ఇంకా చుట్టుపక్కల అన్నిఊళ్ళలోనూ, ఇంకా చెప్పాలంటే ఆ రాష్ట్రం లోనే బాగా ధనవంతుడు అయిన సర్వేశ్వరం, తల్లి లేని తన కూతురు మంజీర ని అనిరుధ్ పెళ్ళిచేసుకోవాలని, అలా చేసుకోనట్టయితే అనిరుధ్ తండ్రి తన దగ్గర ఎప్పుడో తీసుకున్న ఎనిమిది లక్షల రూపాయల అప్పుకు గాను కోర్ట్ లో కేసు ఫైల్ చేసి, అతనికున్న ఒక్కగానొక్క ఆస్తి, అతని తల్లీ తండ్రీ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని స్వాధీనం చేసుకుంటానని బ్లాక్మయిల్ చేసాడు. మామూలుగా అయితే, నిజంగా అప్సరసలా వుండే మంజీర ని పెళ్లి చేసుకోవడానికి అనిరుధ్ కి అంతగా అభ్యంతరం వుండకపోను. కానీ మంజీర, సర్వేశ్వరం ఫ్రెండ్ కొడుకు ఇంకా తమ క్లాస్స్మేట్ అయిన నిరంజన్ అనే వాడిని లవ్ చేస్తూ వుంది, ఇరుపక్కల పెద్దలు కూడా వాళ్ళిద్దరికీ పెళ్ళిచెయ్యాలని నిర్ణయించుకుని వున్నారు. అంతేకాకుండా చిన్నప్పటి స్నేహాన్ని పురస్కరించుకుని అనిరుధ్ తనతో మాట్లాడ్డానికి ప్రయత్నించిన కొన్ని సందర్భాల్లో మంజీర అనిరుధ్ ని అవమానిస్తూ మాట్లాడి చాలా హర్ట్ చేసింది. అందువల్ల మంజీర ని పెళ్లి చేసుకోవడం అనిరుధ్ కి ససేమిరా ఇష్టం లేదు. అయితే వున్న ఆ ఒక్క ఇల్లు తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవు ఆ అనిరుధ్ కి ఆ అప్పు తీర్చడానికి. కేవలం ట్యూషన్స్ చెప్తూ, ఆ ఆదాయం మీద జీవనం సాగిస్తూ ఎలాగన్నా ఐ ఏ ఎస్ కావాలన్న లక్ష్యం తో వున్న అనిరుధ్ కి, తన ఇల్లు కాపాడుకుంటూ మంజీర ని పెళ్లిచేసుకోకుండా ఆ లక్ష్యం ఎలా సాధించాలో అర్ధం కాలేదు.. ఒకవేళ తన ఐ ఏ ఎస్ గోల్ ని పక్కన పెట్టి వుద్యోగం చేసినా, అంత త్వరగా ఆ అప్పు అనిరుధ్ తీర్చలేడు. ఒక వారం రోజుల్లో తన కూతురిని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోవడమో లేక తన బాకీ పూర్తిగా తీర్చడమే చెయ్యకపోతే, తన తండ్రి చేసిన అప్పుకి కోర్టు లో కేసు ఫైల్ చేసి తన ఇల్లు స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తూ వున్నాడు సర్వేశ్వరం. మంజీర, నిరంజన్ ల లవ్ విషయం అనిరుధ్ ప్రస్తావించినప్పుడు, అది కేవలం మంజీర భ్రమ మాత్రమేనని, మంజీర నిరంజన్ ని పెళ్లిచేసుకోబోవడం లేదని ఇంకా అనిరుధ్ ని పెళ్లిచేసుకోవడానికి మంజీర కి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాడు సర్వేశ్వరం. తన తల్లీతండ్రీ ఎంతో ఇష్టపడి కట్టుకుని, ఇంకా వాళ్ళ జ్ణాపకాలతో నిండివున్న తన ఇంటిని వదులుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు అనిరుధ్ కి. అలాగే తనని అవమానించి, అంతకాలం ఆలా నిరంజన్ తో తిరిగిన మంజీర ని పెళ్లిచేసుకోవడం కూడా అనిరుధ్ కి ఇష్టం లేదు. అప్పటి వరకూ నిరంజన్ అన్న వాడితో లవ్ లో వున్న మంజీర ఆ లవ్ ని మరిచిపోయి తననెందుకు పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడిందో, సహజం గా ఎంతో మంచివాడైన సర్వేశ్వరం, కావాలంటే తన కన్నా వెయ్యిరెట్లు మంచి అబ్బాయిని తన కూతురికి తేగల కెపాసిటీ వున్న అతను, తననెందుకు తన కూతురిని అలా పెళ్లిచేసుకోమని బలవంతం చేస్తున్నాడో, అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి అనిరుధ్ మొదలు పెట్టిన అన్వేషణ కధే ఈ హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ "అరె ఏమైందీ?"

About the Author

రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై అయిదు ఇంగ్లీష్ పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా పేపర్ బాక్స్ గా అమెజాన్ లాంటి పాపులర్ ఆన్ లైన్ వెబ్సైట్లు లో లభ్యం అవుతూ వున్నాయి. ఈయన వ్రాసిన మొత్తం అన్ని ఇంగ్లీష్ పుస్తకాల లోని పదాల సంఖ్య నలభై లక్షల పైమాటే. ఈయన పుస్తకాలని ఇంగ్లీషులో వ్రాసినా, అవన్నీ తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు వాళ్ళకి సంభందించినవే. ఇంగ్లిష్ లో రాసిన నలభై ఐదు పుస్తకాలూ కాకుండా, ఈ రచయిత తెలుగు లో రాసిన పుస్తకాలు ఈ పుస్తకం తో కలిపి నాలుగు. తక్కిన మూడు తెలుగు పుస్తకాలు ‘నిరుపమ’, ‘ఆ ఊరి పక్కనే ఒక ఏరు’ ఇంకా 'నులివెచ్చని వెన్నెల' ఈ పుస్తకం లానే లవ్, సస్పెన్స్ అండ్ రొమాంటిక్ థ్రిలర్స్: రచయిత ఫోన్ నం:97019 37966

Book Details

Number of Pages: 340
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

అరె ఏమైందీ?

అరె ఏమైందీ?

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book అరె ఏమైందీ?.

Other Books in Literature & Fiction, Romance

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.