You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
అమెరికాలో తమ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ కోసం మూడు నెలలు ప్లాన్ చేసుకుని వచ్చిన సమీర కి తన డాడ్ ఫోన్ చేసి ముఖ్యమైన విషయం మాట్లాడేది వుందని, వెంటనే ఇండియా కి ఇంటికి బయలుదేరి వచ్చేయమనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయం ఏమిటో చెప్పమని అడిగినప్పుడు, ఏ ప్రశ్నలు అడక్కుండా వెంటనే బయలుదేరి రమ్మని, విషయాలు ఫోన్లో చెప్పేవి కావని తన డాడ్ అనడంతో వెంటనే ఇండియాలో తమ ఇంటికి బయలు దేరింది. కాకపోతే ఇండియా కి వచ్చి, తను తన డాడ్ ని కలుసుకునే లోపే అయన హార్ట్ ఎటాక్ తో చనిపోవడంతో మ్రాన్పడిపోయింది సమీర.
తన డాడ్ చనిపోయారన్న దానికన్నా కూడా ఆయన అంతగా తనతో మాట్లాడదలుచుకున్నది చెప్పకుండా చనిపోవడమే ఎక్కువ బాధకలిగించింది సమీరకి. తనంతగా తనతో మాట్లాడదలుచుకున్నది ఏమిటో తమని ఎంతో ఇష్టపడే, ప్రేమించే తన అత్తయ్య నిర్మల కి కానీ, బావ సంజయ్ కి కానీ, తనకి కూతురు సమానమైన మల్లిక కి కానీ, ఇంకా తన ప్రాణ స్నేహితుడైన డాక్టర్ మనోహర్ కి కానీ తన డాడ్ ఏ కొంచం చెప్పకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది సమీరకి. దానికి తోడు ఇండియాకి వచ్చిన దగ్గరనుండి తనకి కలుగుతున్న విచిత్రమైన అనుభవాలు తనని ఇంకా అయోమయానికి గురి చేశాయి.
తన డాడ్ తనతో అంతగా చెప్పదలుచుకున్నది సమీర తెలుసుకోగలిగిందా లేదా, తన డాడ్ అంత ముఖ్యంగా భావించిన ఆ విషయం ఎటువంటిది, తన ప్రాణ స్నేహితురాలైన మల్లిక, తనని ప్రాణంగా ప్రేమించే అత్తయ్య నిర్మల, బావ సంజయ్ ఇంకా తను ప్రేమించే అనురాగ్ ఆ విషయం తెలుసుకోవడంలో తనకి ఎంతవరకూ సహాయం చేశారు అన్నదే ఈ నవల 'నులి వెచ్చని వెన్నెల'. ఏ స్పైసీ హాట్ లవ్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ డిటెక్టీవ్ థ్రిలర్!
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book నులి వెచ్చని వెన్నెల.