You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
“ప్రపంచంలో అత్యధికంగా చదవబడిన గ్రంథాలలో బైబిల్ ఒకటి. కోట్లాది మంది దాన్ని పవిత్రగ్రంథంగా గౌరవిస్తారు. కానీ ఒక గ్రంథం గురించి నిజంగా తెలుసుకోవాలంటే, దానిని కేవలం వినడం సరిపోదు — మనమే చదవాలి, మనమే ఆలోచించాలి.
బైబిల్ చదివినప్పుడు కొందరికి కొన్ని ప్రశ్నలు కలుగుతాయి. దేవుని స్వభావం గురించి చెప్పబడిన కొన్ని వాక్యాలు ఎందుకు ఇలా ఉన్నాయి? కొన్ని సంఘటనలు మనకు ఆశ్చర్యంగా ఎందుకు అనిపిస్తాయి? ఆ వాక్యాలను మరో కోణంలో చూస్తే ఏమి తెలుస్తుంది? ఇలాంటి ప్రశ్నలను చాలామంది మనసులో ఉంచుకుంటారు కానీ బహిరంగా మాట్లాడటానికి వెనుకడుగు వేస్తారు.
ఈ పుస్తకం ఆ ప్రశ్నలకు భయపడదు. బైబిల్‌లో కనిపించే వాక్యాలను అదే గ్రంథంలోని ఉదాహరణలతో పరిశీలిస్తూ, చదువుతున్న వాని ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రశ్నించడం ఎంత అవసరమో చూపించడానికి చేసిన ప్రయత్నం.
సరళమైన భాషలో, చదివే ప్రతి వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా ఈ గ్రంథం పుస్తకం వ్రాయబడింది. బైబిల్ గురించి విన్నవారికీ, చదివినవారికీ, ఆలోచించాలనుకునేవారికీ — ఈ పుస్తకం ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది.
ఈ పుస్తకం మీకు వున్న అన్నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ ఒక ముఖ్యమైన పని మాత్రం చేస్తుంది — ఆలోచన ప్రారంభిస్తుంది.”
— డా. ఆనంద ప్రసాద్ వేముల, M.Phil., Ph.D.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book బైబిల్ లోని దేవుడు — చదివితే కలిగే ప్రశ్నలు: బైబిల్ వాక్యాలపై ఒక ఆలోచనాత్మక పరిశీలన.