You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

4 - Potana Telugu Bhagavatam - Fourth Skandham :: 4 - పోతన తెలుగు భాగవతము - చతుర్థ స్కంధము.

చతుర్థ స్కంధము
Bhagavata Gananadhyayi
Type: Print Book
Genre: Literature & Fiction, Religion & Spirituality
Language: Telugu
Price: ₹681 + shipping
Price: ₹681 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

This is with Bhagavata original Text of Potana, the Telugu National Poet, value adding by word by word meanings and Meaning in simple words. The writer or the Bhagavatam does not need introduction. But let it be said that Bhagavatam is by keeping it home itself gives positive energy. The Potana specialty is highly appreciated by great pandits even to average people
భారతీయ / హైందవ సంస్కృతి, ఆధ్యాత్మిక రచనలలో మూల గ్రంథాలు మూడు, శ్రీమద్రామాయణము, శ్రీమద్భారతము, శ్రీమద్భాగవతము. రామాయణము ఎలా జీవించాలో చెప్తుంది. భారతం జీవితంలో ఎలా నెగ్గుకు రావాలో చెప్తుంది. భాగవతం సరిగా జీవించడం ఎలానో చెప్తుంది. అంటారు పెద్దలు. మఱి భాగవతం చక్కటి ఆచరణాత్మక వేదాంత జీవనానికి మార్గదర్శకత్వం ఇస్తుంది.
ఇంతటి విలువైన శ్రీమద్భాగవతాన్ని బమ్మెఱ పోతనామాత్యుల వారు సహజకవి పదిహేనవ శతాబ్దములో ఆంద్రీకరించారు. అలతిపొలతి పదాలతో జటిలమైన విషయమైనా వర్ణించడం వీరి ప్రత్యేకత. రాజులు ఇచ్చే భోగభాగ్యాలను కాదనుకుని. శ్రీరామునికి అంకితమిచ్చి, వ్యవసాయంపై జీవించిన నిస్వార్థం జీవి. వీరి శ్రీమదాంధ్రమహాభాగవతము మూల పాఠ్యము, టీక మఱియు భావముల సహితముగా చేసినది ఈ పోతన తెలుగు భాగవతము
అట్టి సహజ కవి బమ్మెఱ పోతన విరచిత 9013 పద్య /గద్యలు, 12 స్కంధాలలో విరాజిల్లే “పోతన తెలుగు భాగవతం” బృహత్ గ్రంథంలోని 977 పద్య/గద్యలు గల చతుర్థ స్కంధము ఈ పుస్తకం.
స్వాయంభువ, కర్దమ, దక్షులు వంశములు, దక్షాధ్వర ధ్వంసము, ధృవోపాఖ్యానము, వేన, పృథుల చరిత్ర, ప్రాచీనబర్హి, ప్రచేతసుల వృత్తాంతములు ఈ చతుర్థ స్కంథము నందు వర్ణించబడ్డాయి. హాయిగా ఆస్వాదించండి.
: :చదువుకుందాం భాగవతం: :బాగుపడదాం మనమందరం: :

About the Author

భాగవత గణనాధ్యాయి కలంపేరు పెద్దలు పెట్టిన పేరు ఊలపల్లి సాంబశివ రావు. వీరి తల్లిదండ్రులు వేంకటరత్నం అచ్యుతరామయ్య గార్లు. తెలుగు జాలజనులు బాగా వృద్దిచెందాలని వీరి ఆశ. తెలుగు ప్రామాణిక మూల గ్రంథాలు అంతర్జాలంలో వాడుకరులకు అనువుగా అందుబాటులోకి రావాలన్నది ఆశయం. ఇందుకోసం పదవీవిరమణ అనంతరం ఈ ప్రవృత్తి చేపట్టారు. ఇప్పుడు వాడుకరులు కొందరు కోరుతున్నట్లు ఇలా కాగితం పుస్తకం రూపంలో కూడా అందిస్తున్నారు.

Book Details

Publisher: Self
Number of Pages: 666
Dimensions: 6"x9"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

4 - Potana Telugu Bhagavatam - Fourth Skandham :: 4 - పోతన తెలుగు భాగవతము - చతుర్థ స్కంధము.

4 - Potana Telugu Bhagavatam - Fourth Skandham :: 4 - పోతన తెలుగు భాగవతము - చతుర్థ స్కంధము.

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Other Books in Literature & Fiction, Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.