You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
సహజ కవి బమ్మెఱ పోతన విరచిత 9013 పద్య /గద్యలు, 12 స్కంధాలలో విరాజిల్లే పోతన తెలుగు భాగవత బృహత్ గ్రంథంలోని 1055 పద్య/గద్యలు గల తృతీయ స్కంధం మొదటి భాగం (530వ పద్యం వరకు గల) పుస్తకం ఇది.
విదుర మైత్రేయ సంభాషణ. జగదుత్పత్తి. బ్రహ్మ మానస సర్గలు. చతుర్యుగాల పరిమాణం. కాల గణన వివరం. వరహావతారం. సనకాదుల శాపం. హిరణ్యకశిప, హిరణ్యాక్షుల జన్మం. కపిల గీత మున్నగు ఉపాఖ్యానాల సమాహారం ఈ స్కంధం.
ఆ రాజ్య పాలకుడు సింగరాజు భూపతి అంకితం ఇమ్మని కోరుతున్నాడు. పోతన లేదు రాముడికే ఇస్తాను అంటున్నాడు. ఓపిక తగ్గిన రాజు పోతన వ్రాస్తున్న గ్రంథం పట్టుకుపోదామని ససైన్యంగా వచ్చాడట. వాకిలి వద్దకు వచ్చేసరికి పెద్ద వరాహం (అడవి పంది) అడ్డం వచ్చిందిట. దీనితో రాజు పరిస్థితి అర్థం చేసుకుని, పోతనను పొగిడి రిక్త హస్తాలతో వెళ్లిపోయాడట.
‘శ్రీనాథ నాథా దండకం’, ‘హవరూపివి’, ‘వరవైకుంఠము” వంటి అద్భుత పద్యాలు ఈ స్కంధంలో ఉన్నాయి. హాయిగా ఆస్వాదించండి.
చదువుకుందాం భాగవతం.
బాగుపడదాం మనమందరం.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book 3 - Potana Telugu Bhagavatam - Third Skandham :: 3 - పోతన తెలుగు భాగవతము - తృతీయ స్కంధము..