You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
₹ 110
ఇది ugkrishnamurti.net web లోని About U.G. Krishnamurti అనే దానికి నా అనువాదం. యు.జి. కృష్ణమూర్తి 20 వ శతాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత భారతీయ తాత్వికులలో తనదైన ప్రత్యేకత ఉన్న వాడు. జిడ్డు కృష్ణమూర్తితో బాగా పరిచయం ఉన్న వాడు, ఆయన ఉపన్యాసలను చాలా సంవత్సరాలు విన్న వాడు. మోక్షం, జ్ఞానోదయం తెలుసుకోవాలనే, పొందాలనే ప్రగాఢమైన వాంఛతో తన సగ జీవితాన్ని దానికై వెచ్చించేడు. ఆయన 49 వ ఏట ఆయన శరీరంలో అనుకోని అనూహ్యమైన ఒక సమూల జీవకణ మార్పిడి సంభవించి, ఆయన చెప్పే “సహజ స్తితి, Natural State” లోకి అడుగు పెట్టేడు. ఈ భౌతిక మార్పిడి ప్రక్రియ జరుగుతున్నంత కాలం ఆయన చెప్ప లేనంత శారీరక బాధలకు గురైయ్యాడు. అందుకే అంటాడు ఆయన “నాకు జరిగింది ‘ఒక Calamity, ఒక విపత్తు` మీ దృష్టితో ఆలోచిస్తే” ఆని. యూజీ తాను పొందిన ఆ సహజస్తితి )Natural State) అకారణం అంటాడు. అంతేకాదు నీ ప్రయత్నాలే నీ సహజ స్తితిని బయట పడనీయకుండా అడ్డుకుంటున్నాయంటాడు. అవగాహన అనేది లేదు, మానసిక పరివర్తన లేదు,అసలు మనసే లేదంటాడు యుజీ. ఆయనకు జరిగిన ఆ “కెలమిటీ” ముందు, తరువాత ఆయన గడిపిన జీవితం గురించి, మానవ జీవన విధానం గురించి ఆయన చెప్పినది క్లుప్తంగా వివరించబడింది, యీ చిన్ని పుస్తకంలో.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ఎవరీ యు.జి. కృష్ణమూర్తి.