You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
“ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం” ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి అనేకమైన ఆధ్యాత్మిక టాబ్లెట్లు (సుమారు 350) తయారుచేసినప్పటికీ, కిరీటంలోని మణులలాగా ప్రధానంగా వాడుకలో ఉండేవి ఈ ‘పన్నెండు టాబ్లెట్లు’. వీటి ద్వారా ప్రాథమిక స్థాయి శిక్షణ సంపూర్ణంగా జరుగుతుంది. ఎలా అయితే వంటగదిలో వంటకోసం ఎన్నో సామాన్లు ఉన్నప్పటికీ ఉప్పు, కారం, చింతపండు, బియ్యం, నూనె ప్రధానంగా ఉండేటట్లు చూస్తామో, అలాగే శాకాహారం, ధ్యానం, పిరమిడ్ శక్తి మొదలైన ముఖ్యమైన వాటిని ప్రధానంగా తీసుకొని ఈ పన్నెండు టాబ్లెట్లు రూపొందించబడ్డాయి. మనం డాక్టరు వద్దకు వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రతీ అనారోగ్యానికి వాడే మందుల చీటీలో కనీసం నాలుగు నుండి అయిదు రకాల మాత్రలు ఉంటాయి. అవన్నీ చెప్పినన్ని రోజులు తీసుకున్నప్పుడే అనారోగ్యం నుండి బయట పడగలుగుతాం. అదే విధంగా హెల్త్ కౌన్సిలింగ్ ప్రక్రియలో ఇచ్చే చీటీలో (Prescription) ప్రధానంగా ఈ పన్నెండు టాబ్లెట్లలో కొన్నింటిని నిత్యం వాడటం జరుగుతుంది. జ్వరానికి ఒక ‘మెటాసిన్', తలనొప్పికి వాడుకలో ఉన్న ‘సారిడాన్' లాగ వెంటనే ఉపశమనం పొందడానికి ఈ “పన్నెండు టాబ్లెట్లు” ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ “డాక్టరు నుండి కాక పేషెంట్ తనకు తానుగా ఆచరించి, తన స్వశక్తితో చేసుకునేవి” అన్న ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. దేనిపైనా ఆధారపడవలసిన అవసరం లేదు. “ఆరోగ్యాభిలాషులకు, ఆనందాభిలాషులకు ఈ పన్నెండు టాబ్లెట్లు ఎంతగానో సహకరిస్తాయని ఆశిస్తున్నాను”. “ఈ జీవితకాలంలో భౌతికంగా అనుక్షణం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గోరుముద్దలుగా తినిపించి నన్ను తీర్చిదిద్దిన పాల్ విజయకుమార్ గారికీ, ఎన్నో రాళ్ళను “ధ్యానరత్నాలు”గా తీర్చిదిద్దుతూ, ఈ ధ్యాన ఆరోగ్యం ప్రాజెక్టు నిర్మాణంలో అనునిత్యం ఎన్నో సూచనలు ఇస్తూన్న “బ్రహ్మర్షి పత్రీజీ” గారికి నా ఆత్మ ప్రణామాలు!
12 Spiritual tablets
It is really very informative, if we follow the points mentioned in this book, we can cure our issues easily through Spiritual Way.