You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ఆంధ్రవాజ్మయంలో తాళ్ళపాక సాహిత్యానికున్న స్థానం విలువ గట్టలేనిది. తాళ్ళపాక సాహిత్యం చదవనిదే తెలుగు పూర్తికాదు అన్నంతగా విస్తృతమయినదీ సాహిత్యం. తాళ్ళపాక కవులు 'ఉభయ కవులు'. అంతేకాదు పండితుల్ని, పామరుల్ని తమ రచనలతో ఆకట్టుకున్న నేర్పరులు. సామాన్య విషయాలను కవి సమయాలుగా మలచుకోవడం తాళ్ళపాక కవులకే తెలుసు. డా. జి. ఉమాదేవి గారు తాళ్ళపాక సాహిత్యాన్ని అనేకమార్లు చదివినవారు. అవగాహన చేసుకున్నవారు. తాను అర్ధం చేసుకున్న దానిని సప్రమాణంగా సరసంగా చెప్పగలిగినవారు. అందుచేతనే వారు రాసిన ఈ పుస్తకం అటు పాఠకులని ఇటు పరిశోధకులని అత్యంత ఆసక్తికరంగా ఆకట్టుకుంది. తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలను అత్యంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారు డా. జి. ఉమాదేవి గారు. ఈ పుస్తకం అందరూ చదువవలసిన పుస్తకం. - ఆచార్య కె. సర్వోత్తమరావు గారు, విశ్రాంత ఆచార్యులు, తెలుగు అధ్యయనశాఖ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.
శ్రీమతి జి. ఉమాదేవి గారి తాళ్ళపాక సాహిత్యంలో కవి సమయాలు అనే ఈ పుస్తకం చదవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. భావుకతా సామ్రాజ్య పట్టభద్రుడైన అన్నమయ్య ఊహల పోహళింపులలోని సౌందర్యం ఒకసారి తిలకించినట్లే మనస్సు పులకించింది. అలంకారిక దృక్పధంలో కవి నేర్పుకు, తీర్పుకు సంబంధించిన పరిణతిని సూచించేవి కవి సమయాలు. ఆ పరిణతిలో తాళ్ళపాక కవుల స్థాయి ఎంత ఉన్నతమైందో శ్రీమతి జి. ఉమాదేవి గారి పరిశోధనా వ్యాసం విశదీకరిస్తూ ఉంది. ఈ పుస్తకం పరిశోధకులకే కాక అన్నమయ్య సాహిత్యాన్ని ఆస్వాదించేవాళ్ళు కూడా తప్పక చదవవలసిన గ్రంధం. - అవధాన చక్రవర్తి, శతావధాన సార్వభౌమ, డా. మేడసాని మోహన్ గారు.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు.