You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
జీవితంలో ఒక్కోసారి కొన్ని తమాషాలు ఎదురవుతుంటాయి. ఎప్పుడో మన మనసులో దాగిన కొన్నిమధుర జ్ఞాపకాలు మన జీవితాంతం తోడుండేట్లు చేస్తాయి. మనం ఎంత గిరి గీసుకుని ఉన్నా, పద్ధతుల పరిమితుల్లో పరిధుల నతిక్రమించకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నా, మనం నమ్ముకున్న విలువల్ని నిరంతరం జాగరూకతతో పాటిస్తున్నా కొన్ని సార్లు విధి తన పని తను చేస్తూ మనం మనసులో అనుకునేవి, మనం కావాలని కోరుకునేవి, ఏ విలువలని అతిక్రమించకుండా, ఎలాంటి మానవ తప్పిదాలు జరగకుండా, తెలిసి మనం తప్పులు చేయకుండా అద్భుతంగా మనకు అనుకూలంగా మన మనసులలో అనుకున్నవి అనుకున్నట్లు చేసి విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. విధి అప్పుడప్పుడు మన జీవితాలతో సరదాగా ఆడుకుంటూ కొన్ని చిలిపి పనులు చేస్తూ తన ముచ్చట తీర్చుకుంటుంటుంది. అలాంటి విధి చేసిన ఓ వింత తమాషాకు ఈ నవల ఓ నిజరూప తార్కాణం. ఓ నిస్సందేహ నిదర్శనం. ఓ అల్లరి భాగోతం.
ఫీల్ గుడ్ నవల
నవల ఆద్యంతం సరదాగానే సాగిపోయింది. ఏడుపులు పెడబొబ్బలు ఏమీ లేకుండా నవ్వులు పూయించారు. నిజంగానే ఇలాంటి నవల రాయడం అంటే కత్తి మీద సాము వంటిదే. పరిపక్వత కలిగిన మనుషులు (మనసులు) మధ్య మరో పెళ్లి ఘట్టం హృద్యంగా మలిచారు రచయిత గారు. నవల ముగింపు చాలా అర్ధవంతంగా హాస్యంతో కూడి ఒక మంచి నవల చదివిన తృప్తినిచ్చింది. రచనా శైలి ఆద్యంతమూ చాలా బాగుంది. సమాజంలో ఇలాంటి భార్యా భర్తలు ఉంటె విడాకులు అనేవి ఉండవేమో. చాలా బాగా రాశారు. ఏ పాత్రను తక్కువ చేయలేదు. అది చాలా గొప్పతనం. మీరు మరిన్ని రచనలు చేయాలని కోరుకుంటున్నాను.బెస్ట్ విషెస్.