You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

బైబిల్ లోని దేవుడు — చదివితే కలిగే ప్రశ్నలు (eBook)

బైబిల్ వాక్యాలపై ఒక ఆలోచనాత్మక పరిశీలన
Type: e-book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹49
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

ప్రపంచంలో అత్యధికంగా చదవబడిన గ్రంథాలలో బైబిల్ ఒకటి. కోట్లాది మంది దాన్ని పవిత్రగ్రంథంగా గౌరవిస్తారు. కానీ ఒక గ్రంథం గురించి నిజంగా తెలుసుకోవాలంటే, దానిని కేవలం వినడం సరిపోదు — మనమే చదవాలి, మనమే ఆలోచించాలి.
బైబిల్ చదివినప్పుడు కొందరికి కొన్ని ప్రశ్నలు కలుగుతాయి. దేవుని స్వభావం గురించి చెప్పబడిన కొన్ని వాక్యాలు ఎందుకు ఇలా ఉన్నాయి? కొన్ని సంఘటనలు మనకు ఆశ్చర్యంగా ఎందుకు అనిపిస్తాయి? ఆ వాక్యాలను మరో కోణంలో చూస్తే ఏమి తెలుస్తుంది? ఇలాంటి ప్రశ్నలను చాలామంది మనసులో ఉంచుకుంటారు కానీ బహిరంగా మాట్లాడటానికి వెనుకడుగు వేస్తారు.
ఈ పుస్తకం ఆ ప్రశ్నలకు భయపడదు. బైబిల్‌లో కనిపించే వాక్యాలను అదే గ్రంథంలోని ఉదాహరణలతో పరిశీలిస్తూ, చదువుతున్న వాని ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రశ్నించడం ఎంత అవసరమో చూపించడానికి చేసిన ప్రయత్నం.
సరళమైన భాషలో, చదివే ప్రతి వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా ఈ గ్రంథం పుస్తకం వ్రాయబడింది. బైబిల్ గురించి విన్నవారికీ, చదివినవారికీ, ఆలోచించాలనుకునేవారికీ — ఈ పుస్తకం ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది.
ఈ పుస్తకం మీకు వున్న అన్నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ ఒక ముఖ్యమైన పని మాత్రం చేస్తుంది — ఆలోచన ప్రారంభిస్తుంది.
ఒక్క సారి చదివితే, ఇది మీ ఆధ్యాత్మిక దృష్టిని సవాలు చేస్తుంది మరియు బైబిల్ సూత్రాలపై మీ అవగాహనను విస్తరించడంలో సహాయపడుతుంది.

— డా. ఆనంద ప్రసాద్ వేముల, M.Phil., Ph.D.

About the Author

డా. వెంకట్ పోతన ఒక, సిద్దాంతజ్ఞుడు, ప్రొఫెసర్ మరియు రచయిత. వివిధ దేశాల్లో 30 సంవత్సరాలకు పైగా సేవా అనుభవం కలిగి ఉన్నారు. ఆయనకు వేదాంత విధ్య లో పీహెచ్.డి. మరియు అంతర్జాతీయ సంస్కృతి అధ్యయనం, తత్త్వశాస్త్రం, సామాజిక సేవ, మరియు దైవశాస్త్రంలో అభ్యున్నత మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి.
డా. పోతన అనేక దేశాలలో వివిధ సందర్భాల్లో వేలాది విద్యార్థులు, మరియు నాయకులకు శిక్షణ ఇచ్చి, మార్గదర్శనం చేశారు.
ఆయన 65 కంటే ఎక్కువ పుస్తకాలను రాశారు, వీటిలో థియాలజీ, కుటుంబం, శిష్యత్వం వంటి అంశాలు ఉన్నాయి. ఆయన పుస్తకాలు ప్రత్యేకంగా ప్రాక్టికల్ సమస్యలపై కేంద్రీకరించబడ్డాయి – అంతేకాక, అకాడెమిక్ రంగంలో కూడా, పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో వ్యాసాలు ప్రచురించి, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లలో ప్రసంగించారు.
ఆయన CBN మరియు ఇతర టెలివిజన్ నెట్‌వర్క్‌లలో కూడా పాల్గొని, వ్యక్తిగత సాక్ష్యం, సాంస్కృతిక అంశాలపై పరిశీలనలు, మరియు సాంస్కృతిక సందర్భంలో సమాజ సేవలను ప్రతిబింబిస్తూ ప్రసంగించారు.
డా. పోతన జీవితం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమై, కుటుంబాలు మరియు సమాజాలను బలపరిచే విధంగా ఉంటుంది. ఆయన డల్లాస్, టెక్సాస్‌లో తన కుటుంబం తో జీవిస్తున్నారు.

Book Details

Publisher: పోతన పబ్లికేషన్స్: రచయిత స్వతంత్ర ముద్రణ
Number of Pages: 111
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

బైబిల్ లోని దేవుడు — చదివితే కలిగే ప్రశ్నలు

బైబిల్ లోని దేవుడు — చదివితే కలిగే ప్రశ్నలు

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book బైబిల్ లోని దేవుడు — చదివితే కలిగే ప్రశ్నలు.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.