You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
నా చేతి రాతలు అనేది, సృజనాత్మకమైన కవితల పుస్తకం ఇందులోని ఒక్కొక్క కవిత. మన జీవితంలో జరిగిన గతమును గుర్తు చేస్తున్నట్టుగా ప్రస్తుతమును కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. ఈ పుస్తకంలోని పదాల కూర్పు సామాన్య ప్రజలకు సైతం అర్ధమయ్యే రీతిలో ఉంటుంది. ఈ పుస్తకంలో భావోద్వేగమైన, స్నేహపూర్వకమైన, ప్రేమానురాగాలతో కూడిన కవితలు, సమాజనికి ఉపయోగపడే సందేశాత్మకమైన కవితలు ఉన్నాయి.నేడు సమాజంలో జరుగుతున్న అరాచకాలను, అకృత్యాలను.. మొదలైన సంఘటనలను గూర్చి నోరు మెదపడానికి భయపడే జన సమూహంలో, వాస్తవాలు,నీరుగారిపోయి బయటకురాని కథలు ఎన్నో ఒక్కసారి ఆలోచించాలి.
“ కలము రాయని కావ్యాలెన్నో
అక్షరం తెలపని పదాలెన్నో
మౌనం పలకని మాటలెన్నో
గొంతు విప్పని గళములెన్నో
సమాజమా సమంజసమా..! “
అని ప్రశ్నించేది, నా కవిత్వం.
“ఎండిన చెట్టుకు రాలిపడే
ఆకు కాలము జీవితమూ..
ఊగుతూ ఆగుతూ
సాగుతుంది దాని పయనం ”
జీవితం అనేది సాఫీగా సాగిపోయే రహదారి కాదు. ఎన్నో ఒడిదుడుకుల కలయిక.
నా చేతి రాతలులో ఎన్ని కవితలు ఉన్నా “ఓ నేస్తమా” అనేది నా హృదయాన్ని హత్తుకున్న కవిత. ఈ పుస్తకాన్ని రాయడానికి నా మిత్రులే నాకు ప్రేరణ.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Na Cheti Ratalu.