You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
కరోనా గురించి రాసిన రెండో పుస్తకం... ''ష్.. వైరస్''
ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి ఇది. వందేళ్లకోసారి మానవాళి మీద విరుచుకుపడే ఇలాంటి మహమ్మారి గురించి భావితరాలు తెలుసుకునేలా ఇప్పటి చరిత్రను కొంతైనా పదిలపరిచేందుకు సేకరించిన సమాచారమిది.
ముఖ్యంగా కొ'విడియెట్' ఎవరో ప్రపంచానికి తెలియాలి కదా.. దానిని వివరించే ప్రయత్నం చేసిన పుస్తకమిది.. అసలు జీవాయుధాల చరిత్ర ఏమిటి? మధ్య యుగాల నుంచే సామ్రాజ్యవాద కాంక్షతో వాటిని ఉపయోగించడం ఎలా మొదలైంది.. ప్రపంచగతిని మార్చిన అంటువ్యాధులేమిటి వంటి అంశాల గురించి వివరించే ప్రయత్నమిది.
ఇంకొక మాట ఏమిటంటే.. అవునన్నా కదాన్నా.. 'కరోనా' మనందరి జీవితాలను.. కనీసం ఆలోచనలను, జీవన విధానాలను మార్చేసిన కాలమిది.
కనుమరుగైపోయిన కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలన్నీ.. కనీసం కొద్దికొద్దిగా మెరుగవుతాయేమో ఇకనుంచి.. అసలు జీవితం అంటే ఏమిటో రియలైజ్ అయ్యే పరిస్థితుల్ని సృష్టించింది ఈ వైరస్. ఇదొక శుభపరిణామమేనేమో. వాటన్నింటిన సమాహారమే ఈ పుస్తకం..
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Ssshhhh.. Virus (Telugu).