You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
నిన్నటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు అనుభవాలను మరిపిస్తాయి.
గతంతో పెనవేసుకున్న అనుబంధాలు వర్తమానంలోని ఒంటరితనాన్ని పోగొడతాయి.
సమస్యనూ, సవాళ్లనూ ఎదుర్కొనే కొత్త శక్తిని చేకూరుస్తాయి.
అదే నొస్టాల్జియా..
ఇదో జ్ఞాపకాల చికిత్స. గతానుభూతుల వైద్యం.. అమ్మ కొంగులాంటి లాలన.. నాన్న భుజం లాంటి ఆసరా.. ‘కుంగుబాటునూ, ఒంటరితనాన్నీ అధిగమించడడానికి మెదడు ఏర్పాటుచేసుకున్న గొప్ప రోగ నిరోధక వ్యవస్థ ఇది అంటారు పరిశోధకులు.
గ్రీకు భాషలో నోస్టోస్ అంటే ‘ఇంటికి తిరిగి వెళ్లాలన్న’.. అల్గోస్ అంటే ‘బాధ’.. అని అర్థం.
మొత్తంగా ఇదో ప్రవాస వ్యధ. ఉపాధి వెతుక్కోడానికో, ఉనికి చాటుకోడానికో ఊరి పొలిమెర¢, దేశ సరిహద్దూ దాటి వెళ్లినవారిలో ఏదోక సమయంలో మొదలయ్యే మూలాల గురించిన బెంగ ఇది.
సంపాదనలూ, పదోన్నతులూ, సొంతిళ్లూ, పేరు ప్రఖ్యాతుల కోసం పెట్టిన పరుగులన్నీ ఓ కొలిక్కివచ్చిన తర్వాత మనిషిని ఓ మోస్తరు శూన్యం ఆవరించేస్తుంది. ఆబగా ఆకాశానికి నిచ్చెనలేస్తున్నవాడిని కాస్తా తీవ్ర వైఫల్యాలో, విధి వైపరీత్యమో మెడ పట్టుకుని నేల మీదకు లాక్కొచ్చేస్తాయి. అప్పుడే మన అనువర్తనలోని డొల్లతనాలు బయటపడతాయి. నిన్నటిదాకా గొప్పగా అనిపించినవీ, మహాద్భుతంగా తోచినవీ కృతకమేనన్న సత్యం బోధపడుతుంది. నోస్టాల్జియా ఆ శూన్యాన్ని భర్తీ చేస్తుంది.
కరోనా మహమ్మారి తరుముతున్న వేళ ఈ ప్రపంచమంతా తన పరుగును ఆపేసి ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటోంది. అభివృద్ధి పేరుతో ఆకాశానికి నిచ్చెనలేస్తున్న మనిషి Ëఒకసారి ఆగి తన మూలాల్లోకి తొంగి చూసుకోవలసిన...
achyutalakshmi says...
I read CORONASTALGIA Book written by Mr.Venkoo. It is very informative and interesting to read.
Whatever information we read in news papers from the beginning of the spread of corona...
This is first book in my life i read completely
this book is nicely presented regarding corona virus from dec 2019 to august 2020 and additional for a change personnel life details also added. This is first book in my...