You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
"ప్రేమించడం అంటే ఒకరిని మన జీవితంలోకి బలవంతంగా తెచ్చుకోవడం కాదు.. ఒకరి కోసం మనల్ని మనం ఇష్టంగా మార్చుకోవడం. మనల్ని మనం కోల్పోయి, వారి కోసం వెతుక్కునే ప్రయాణంలో మనకు తెలియని ఒక కొత్త 'మనం' పరిచయం అవ్వడమే ప్రేమ.
నా జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. లోకం నన్ను వెక్కిరించినప్పుడు, పరిస్థితులు నన్ను అణచివేసినప్పుడు.. ఆ అవమానాల చీకటిలోనే నేను నన్ను వెతుక్కున్నాను. ఆ గాయాలే నాకు పాఠాలు నేర్పాయి. ఆ బాధలే నన్ను మళ్ళీ మనిషిని చేశాయి. ఇది కేవలం ఒక పుస్తకం కాదు.. 21 ఏళ్ల ఒక యువకుడు (కన్నా), తన 'లక్ష్మీ ' చిరునవ్వు కోసం తనని తాను ఎలా అర్పించుకున్నాడో చెప్పే ఒక ఆత్మ నివేదన.
తను నాకు దక్కుతుందో లేదో తెలియదు, కానీ తన ప్రేరణతో నేను మారాను.. అది చాలు!
నిజమైన ప్రేమకు నిరీక్షణే భాష అయితే.. ఆ భాషకు అక్షర రూపమే ఈ కావ్యం!"
- మీ నవీన్ గోపి
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book sivayya kalipina prema katha.