You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ప్రముఖ న్యాయమూర్తిగా, ప్రసిద్ధ రాజనీతిజ్ఞుడుగా ఖ్యాతి వహించిన మహమ్మద్ అలీ కరీం చాగ్లా తన జీవితయాత్రను 'రోజెస్ ఇన్ డిసెంబర్' అనే పేర గ్రంథస్తం చేశారు. తన ఆత్మకథను నిజాయితీగా వివరించారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తాను ఎదురుకొన్న ముఖ్య ఘట్టాలను వెల్లడించడంతో పాటు 20వ శతాబ్దపు చారిత్రక, రాజకీయ విశేషాలను పాఠకులకు అందించారు. ఒక విద్యావేత్తగా, దౌత్య ప్రముఖుడిగా, కేంద్ర మంత్రిగా, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన అనుభవంతో జ్ఞానదాయకమైన ఆలోచనలను ఆత్మకథ రూపంలో పొందుపరిచారు. న్యాయవ్యవస్థ, మానవ హక్కుల పట్ల తనకున్న నిబద్ధతను బలంగా ప్రకటించారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో జరిగిన సంఘటనల పట్ల తన ప్రతిస్పందనను ఎలాంటి మొహమాటం లేకుండా తెలిపారు.
అహ్మదాబాద్ లో జరిగిన పౌర విమోచన సంఘానికి సంబంధించిన వార్షిక సమావేశంలో చాగ్లా చేసిన ప్రసంగాన్ని ఒక 'మాగ్నా కార్టా' గా లోకనాయక్ జయప్రకాశ్_నారాయణ్ అభివర్ణించారు. కాశ్మీరు సమస్య గురించి, ఆనాటి ప్రధానుల, రాష్ట్రపతుల వ్యవహారశైలి గురించి చాగ్లా ఈ పుస్తకంలో ముచ్చటించారు. జీవితంలో ఎదురైన సంతోషాలను, విషాదాలను పలవరిస్తూ, పాఠకులతో తన అనుభూతులను పంచుకున్నారు. చరిత్ర పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల ఆసక్తి ఉన్నవారికి అత్యంత పఠనీయమైన పుస్తకంగా ఈ ఆత్మకథను రూపొందించారు.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book శిశిరంలో గులాబీలు (Sisiramlo Gulabeelu).