You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
శ్రీ కృష్ణ భగవానుడు అన్నమాటలు ఇవి. ఈ లోకంలో మనిషి జీవనవిధానానికి రెండే మార్గాలు ఉన్నాయి.
ఒకటి లౌకిక మార్గం. అంటే ఇప్పుడు మనం అనుసరిస్తున్న జీవన విధానం. అదే “నేను – నాది” కి ప్రాముఖ్యం ఉన్న జీవనసైలి. మన చదువులు, ఉద్యోగాలు వాటినే ప్రాముఖ్యంగా చేసుకొని ముందుకి నడుస్తున్నాయి. ఇందులోనుంచీ బయటకి రావడం ఈ కలియుగంలో సాధ్యపడదు కాబట్టి అందులోనే ముందుకి వెడదాము.
మరో మార్గం ఆత్మవిజ్ఞాన మార్గం. అంటే “ఆత్మ” ను తెలుసుకొనే మార్గం. కృష్ణ భగవానుడు పూర్వం వినస్వంతుడికి చెప్పినదే మరొకసారి అర్జునుడికి చూపిన మార్గం. మనం ముందు ఆత్మ అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి అనే అలోచన వస్తే, అందుకోసం భగవద్గీత చదవాలి. భగవద్గీత ఏ కారణాలవల్ల మనకు మహా భరతం లో వినిపించారు అనేది తెలుసుకుందాము. మహా భారత యుద్ధానికి ముందు వేదవ్యాసుడు ఇంకా ఎందరో మహర్షులు ధృతరాష్ట్రుడికి యుద్ధం వలన వాళ్ళకి కలిగే అనర్ధాలని తెలపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవరిమాటా ధృతరాష్ట్రుడు వినిపించుకోలేదు. యుద్ధానికి ముందు, వేదవ్యాసుడు నీకు యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఉన్నదా అని అడిగాడు. అందుకు నిరాకరించిన ధృతరాష్ట్రుడు, అతని రధ సారధి, మంత్రి ఐన సంజయుడుకి ఆ శక్తిని ఇవ్వమని కోరాడు. వ్యాసుడు, సంజయుడిని ఉద్దేశించి, నువ్వు యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడగలవు, నీవు అక్కడ ఉన్నట్టుగా వాళ్లకి తెలియదు, ఇంకా నువ్వు వాళ్ళ మాటలను వినడమే కాకుండా, అప్పుడు వాళ్ళ మనసులో ఆలోచనలని కుడా తెలుసుకోగలవు అని వరం ఇచ్చాడు.
ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు. కురు వంశంలో పెద్దవాడు. కానీ గుడ్డివాడు అవడం మూలంగా రాజుగా అతన్ని సింహాసనంలో కుర్చోపెట్టినా, రాజ్య పరిపాలన అంతా తమ్ముడు పాండురాజు చేసేవాడు. పాండురాజు వీరత్వం వలన, పరిపాలన దక్షత వలన మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఇది ఎంతగానో దృతరాష్ట్రుడి మనసు నొప్పించేది. ఇది ఇలావుండగా, పాండురాజుకి మొదటి సంతానం ధర్మరాజు, భీముడు రెండో సంతానం. అప్పటికి ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడు మొదటి సంతానం గా పుట్టాడు. ఈ రకంగా చుస్తే కురువంశానికి జేష్టుడు ధర్మరాజు అయ్యాడు. దృతరాష్ట్రుడి మనసుకి రెండు దెబ్బలు. ఒకటి, తాను పెద్దవాడు అయి కూడా రాజుగా ప్రజలు భావించడం లేదు, రెండు, తన తమ్ముడికి, తనకంటే ముందు కొడుకు పుట్టేసాడు. ఆరకంగా రాజ్యాధికారాన్ని పొందడానికి ధర్మరాజు అర్హుడు. ఇవన్నీ అతనిలో అసూయా, ద్వేషం, కోపం, అసహనం వంటి వాటికి కారణం అయ్యాయి.
తరవాత జరిగిన మహాభారతం ఆంతా మీకు తెలుసును. కౌరవ పాండవ యుద్ధం తప్పనిసరి అయింది. కౌరవుల తరఫున ఉన్న వీరులలో అందరూ ఎంతో గొప్ప వీరాధి వీరులు, అందరూ ఎందరిచేతనో ప్రశంసింపబడినవారు. ముఖ్యంగా భీష్ముడిని ఓడించగలవారు లేరు. ఇదే ధృతరాష్ట్రుడి మనసుకి ఎంతో బలం. పదవరోజు యుద్ధంలో భీష్ముడు పడిపోయాడని విని కలత చెందుతాడు. ఇది అతని ఊహకి అందని విషయము. అప్పుడు సంజయుడిని పిలిచి యూద్ధంలో ఏమి జరిగిందో చెప్పమంటాడు. సంజయుడికి వేదవ్యాసుడు ఇచ్చిన వరం వలన యుద్ధవివరాలు అన్నిటిని చెపుతాడు. ఇందులో ప్రధమంగా వచ్చినది భగవద్గీత. యుద్ధానికి ముందు జరిగిన సన్నివేశము.
నా మాట
భగవద్గీత ఆంటే సంస్కృత శ్లోకాలు. ఈ శ్లోకాలకి తెలుగు అనువాదం వాడుక భాషలో చేసాను. అంటే, కృష్ణుడు, అర్జునుడి మధ్య సంభాషణ మన తెలుగు పదాలలో ఉన్నాయి. ఇందులో వేరే వ్యాఖ్యలు ఏమి ఉండవు.
భగవద్గీత మన జీవన విధానానికి మార్గదర్శకం. ప్రతి శ్లోకం మనము జీవితాన్ని ఎలా నడుపుకోవాలో చెబుతుంది. మనకి - మనిషి, భగవంతుడు లో భేదం ఉన్నదా? ఉంటే ఎక్కడ ఉన్నది, అనే విషయం తెలియపరుస్తుంది. ఆ భేదాన్ని ఎలా తగ్గించ్చుకోవచ్చో కూడా చెబుతుంది. అందుకే భగవద్గీతని వేదాల సారం అని అన్నారు. ఈ విషయాలు చదివి అర్ధం చేసుకుని, ఆచరించి తరించండి.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book భగవద్గీత వచనము.