You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
భక్తి మార్గంలో నడిచే ప్రతి సాధకుడికి సద్గురు అనుగ్రహం అత్యవసరం. గురుకృప లేకుండా ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదని శాస్త్రాలే స్పష్టం చేస్తున్నాయి. అటువంటి గురుకృపకు జీవంత ప్రతిరూపంగా మహారాష్ట్రలో అవతరించిన మహానుభావుడు శ్రీ గజానన మహారాజ్ (శేగావ్).
ఆ పరమపూజ్యులైన శ్రీ గజానన మహారాజ్ వారి దివ్య లీలలను, బోధనలను, మహిమలను భక్తుల హితార్థం దాసగణు మహారాజ్ గారు మరాఠీ భాషలో “శ్రీ గజానన విజయం” అనే మహత్తర గ్రంథంగా రచించారు. ఈ గ్రంథం కేవలం ఒక చరిత్రాత్మక రచన మాత్రమే కాదు; ఇది జీవన మార్గదర్శకం, భక్తికి భాష్యం, గురుకృపకు ప్రతిరూపం. ప్రతి అధ్యాయం సాధకుని మనస్సును శుద్ధి చేసి, హృదయంలో భక్తిని నాటే శక్తి కలిగిన అమృత వాక్యాల సమాహారం.
తెలుగు భక్తులకు కూడా ఈ మహానుభావుని లీలలు, ఉపదేశాలు, కరుణామయ స్వరూపం సులభంగా అర్థమవ్వాలనే సంకల్పంతో ఈ గ్రంథాన్ని స్వేచ్ఛానువాద రూపంలో తెలుగులో అందించాలనే ప్రయత్నం జరిగింది. ఇది పదానువాదం కాదు. మూల రచన యొక్క భావాన్ని నిలుపుకుంటూ, భక్తి రసాన్ని కాపాడుకుంటూ, పారాయణకు అనువుగా రూపొందించిన భావానువాదం మాత్రమే.
ఈ మహాగ్రంథ రూపకల్పనలో, అనువాదంలో గాని, భావవ్యక్తీకరణలో గాని ఎక్కడైనా భాషా లోపములు, భావ లోపములు దొర్లి ఉంటే, అవన్నీ నా అపరిపక్వతగా భావించి, సద్గురు శ్రీ గజానన మహారాజులు కరుణా పూర్వకంగా క్షమించగలరని వినమ్రంగా ప్రార్థించుచున్నాను.. ఈ గ్రంథాన్ని చదివే ప్రతి హృదయంలో భక్తి వెలుగులు వెలగాలని, గురుపాదాలపై అచంచలమైన విశ్వాసం పెంపొందాలని, జీవితంలో శాంతి, సత్సంకల్పం, సద్గుణాలు వికసించాలని శ్రీ గజానన మహారాజ్ పాదాల వద్ద భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
ఈ కార్యమంతా గురుకృప ఫలమే.
సర్వం శ్రీ సాయిరాం గురుకృపార్పణమస్తు.
— యాపర్ల లక్ష్మినారాయణ రెడ్డి
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book SRI GAJANANA VIJAYAM.