You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
నేటి మానవునికి “జ్ఞానం” ఏ స్థాయిలో ఉందో “అజ్ఞానము” అదే స్థాయిలో ఉంది. రోజురోజుకీ మనిషి శాస్త్రీయ జ్ఞానంలో ఎదుగుతున్నా విలువలు పాటించడం, సంస్కారవంతంగా జీవించడం, జీవితాన్ని సరైన దృష్టిలో అర్థం చేసుకోవడం, మానవత్వం ప్రదర్శించడంలో దిగజారుతున్నాడు. సంకుచిత మనస్తత్త్వం, మితి మీరిన స్వార్థం, విపరీత కోరికలు, సర్వభోగాలు అనుభవించాలనే తపన, ధనముపై వ్యామోహం, అహం నేటి మనిషిని అజ్ఞానం అనే గాఢ అంధకారంలోకి తీసుకోపోతున్నాయి.
తెలివి తేటలు ఎక్కువైనా కొద్దీ చెడిపోతున్నారు. చదువుకున్నవారికే వంకర బుద్ధులు ఎక్కువగా ఉంటున్నాయి. “మా” అనే ధోరణి తక్కువైంది, “నా” అనే ధోరణి ఎక్కువైంది. నా సంపాదన, నా వస్తువులు, నా కష్టార్జితం అంటూ ఒకే కుటుంబం వారైనా తెలియకుండానే ఇండిపెండెన్సీ (Independency) పెంచుకుంటున్నారు. శాంతి కోసం అంటూ అణ్వాయుధాలు పోగుచేసుకుంటున్నాడు. భవిష్యత్తు బాగుండాలి అని కలలు కంటూ వర్తమానాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కొత్తదనం పేరిట ప్రకృతిని వికృతిగా మారుస్తున్నాడు. సహజం కన్నా అసహజం ఎక్కువయ్యింది. తన అవసరాలను తీర్చుకోవటానికి మూగ జీవాలని అడ్డు అదుపు లేకుండా బలి చేస్తున్నాడు. భోగాలు, సుఖాలు అనుభవించడమే జీవిత పరమార్థంగా బ్రతుకుతున్నాడు. మనం బాగుంటే చాలు ప్రపంచం ఏమైపోతే మనకేంటి అనే భావన పెంచుకుంటున్నాడు. తనకున్న జ్ఞానాన్ని నిజజీవితములో ఉపయోగించలేకపోతున్నాడు. అవసరమైన విషయాలకన్నా అనవసరమైన విషయాలను ఇతరులతో పదే పదే పోల్చుకుంటున్నాడు. చిన్న వయసులోనే వ్యసనాలకు, శారీరక సుఖాలకి బానిసవుతున్నాడు.
మానవుని ఆయుషు వందేళ్లు. రెప్పపాటు జీవితం. కానీ తానెవడో, ఈ భూమ్మీదకు ఎందుకొచ్చాడో తెలుసుకోకుండా.. ప్రపంచ స్థితిగతుల్ని మార్చాలని తన జీవితమంతా దారబోసి, ఏదో చేయబోతాడు చివరకు ఏదో జరుగుతోంది. ఇలా మనిషి చేసే అజ్ఞానపు పనులు అంతా ఇంతా కాదు.
మనిషిలోనున్న ఆజ్ఞానాన్ని నశింపజేసి, తనను తాను ఉద్ధరించుకునే జ్ఞానం ప్రసాదించే ప్రయత్నమే ఈ పుస్తకము.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Hamsavahini (Telugu).