You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
జననమరణాల పరంపరనుండి విముక్తి (ముక్తి) కలుగుటకు భక్తి మార్గము ఒకటి. ప్రస్తుత కాలములో మనుషుల మధ్య బంధాలు అంతంత మాత్రమే. బంధుత్వ మైనా, స్నేహమైన పేరుకు మాత్రమే. ఇటువంటి అసహజ ద్వేషాలు, ద్రోహాలు లేకుండ దాటించగలది భక్తి మార్గము.
జీవునికి, దేవునికి మధ్య వారధి భక్తి. భగవంతుడిని ఆరాధించడమే భక్తి అని నారదుడు, పరాశరుడు తెలియజేశారు.
సాధకులు, ఆరాధకులు ఏ విధంగా ఉండాలో మనకు నారదభక్తి సూత్రాలు విపులీకరించాయి. భక్తి తో తన ఇష్టదైవాన్ని ఆరాధిస్తే మనఃశ్శాంతి కలుగుతుంది . మనసులో చెడు ఆలోచనలకు తావుండదు . సన్మార్గములో నడిచేందుకు వీలుపడు తుంది. ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చును. నిత్యజీవనంలో ఒత్తిళ్ళకు , ఒడిదొడుకులను తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది. మనసు ప్రశాంతం గా ఉంటే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది . 80 శాతము శరీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణము. భక్తితో వీటి నన్నింటినీ అధిగమించ వచ్చును.
అహంకారం - విశ్వాసం యీ రెండు చిత్రమైనవి. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు యిద్దరు బలవంతులు మరియు నిర్బయులు. కానీ హిరణ్యకశిపుని బలం, నిర్బ యత్వము బయంకర మైన హింసతో కూడి అహంకారాన్ని పెంచింది. ప్రహ్లాదుని నిర్భ యత్వం, బలం వేరు. శ్రీహరే తన పరమాత్మయని, ఆయనే తనకు అభయం,బలం అని విశ్వసించి,తన తండ్రి ఎన్ని కటిన శిక్షలు విదించిన చెక్కు చేదరక నిలబడ్డాడు. హిరణ్య కశిపుని ధీరత్వంలో స్వాభిమానం, అవినయం ఉంటే... ప్రహ్లాదుని ధైర్యంలో విశ్వ మంతా విష్ణుమయంగా దర్శించే ప్రేమ, వినయం ఉన్నాయి. రాక్షసునిది సంకోచించిన స్వార్థశక్తి అయితే, భక్తునిది విస్తరించిన విష్ణు శక్తి. భగవంతుడు సర్వంతర్యామియని, నిప్పు, నీరు, నేల కూడా విష్ణుమయమని, 'ఇందుగలడందు లేడ'ని స్తంభములో ధర్శింప జేశాడు.
మృగమూ నరుడూ కూడా విష్ణుశక్తితో ఉన్న వారేనని నొక్కి పలికాడు. అది నిజమని, ప్రపంచంలో అంతర్యామిగా ఉన్న భగవత్ శక్తి 'మృగనర' (నరసింహ) శరీరంతో కనిపించింది. ఇది ప్రహ్లాదుని విశ్వాసానికి, భక్తికి సత్యస్ఫురణకు నిదర్శనం.
అనంతశక్తిని అంతటా దర్శించి అనుభవించే ప్రహ్లాదుడు, భక్తికి పరి పూర్ణ స్థాయి. భక్తి తొలిదశలో 'విశ్వాసం', పరిణతి దశలో 'అనుభవం'. ఆ అనుభవం సత్యాన్ని నిరంతరం సాక్షాత్కరింప జేసుకోవడమే కాదు – అవసర మైతే ప్రత్యక్షం చేయగలదు కూడా.
ప్రపంచాన్ని భిన్నభిన్నంగా చూసి 'రెండు'గా దర్శించే భౌతిక దృష్టి రాక్షసం. అది స్వార్ధహేతువు. ఈ దృష్టితో ఏ అభివృద్ధిని సాధించినా అది శాశ్వతం కాదు. భిన్నంగా గోచరించే జగత్తులో-పూసలలో దారంలా ఉన్నది ఒకే ఈశ్వర చైతన్యమని చాటి చెప్పే ఆధ్యాత్మిక దృష్టి దైవీయం, ఇది ఏకత్వాన్ని దర్శిస్తుంది. (ఆ దిశగా ఎదగని కేవల దేవతా పూజలు భక్తి అనిపించుకోవు) రెండుగా కనిపించే విభిన్న పదార్థాల్లో ఏకమైన శక్తికి సాకారమిస్తే - ద్వంద్వాలను ఏకం చేసిన 'నర - మృగ' శరీర సంకేతం సాక్షాత్కరిస్తుంది. రెండు భాగాలకీ ఒకే శరీరం. భిన్నత్వంలో ఉండే ఏక చైతన్య ప్రదర్శనం.
Very good
Read this book to know about narasimha swamy history. This story based on pothana bhaghavatham