You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
మనం భగవంతుని కోసం గుళ్ళు,గోపురాలు తిరుగు తుంటాము. తీర్థ యాత్రలు చేస్తుంటాము. పుస్కరాలలో, నదులలో స్నానముచేస్తుంటాము. ఎన్నో వేలు ఖర్చుచేసి ఎన్నో రకాల పూజలు,వ్రతాలు,యజ్ఞాలు చేస్తున్నాము. అయిన ఫలితము కలగడ లేదు. ఎందుకంటే ఆచరణ లోపము. మనలోని ఈర్ష,అసూయ, ద్వేషము, స్వార్థములను వీడలేక పోవడం. భగవంతుని తత్వాన్ని అర్థముచేసుకోలేక పోవడము.
భగవంతుడు సమస్త జీవకోటిలోనే కాక,యీ విశ్వాన్నంత ఆవరించియున్నాడు. ఆ భగవంతునిని తెలుసుకోడానికి ఎన్నోమార్గాలు వున్నాయి. పూజలు,వ్రతాలు యజ్ఞాలు ఇంకా ఎన్నో విదానాలు వున్నాయి.ఆ భగవంతుడు శ్రీసాయి అయితే,ఆయన అనుగ్రహము పొందడానికి, ఆయన బొదనలను, ఆయన ఆచరించిన పద్ధతులను ఆకలింపు చేసుకోవాలి.
శ్రీ సాయి ఎలాంటి ఆడంబరాలను యిష్టపడడు. కాని భక్తుల కోరికను కాదనలేడు. అందు వలననే రకరకాల విదానలలో భక్తులు ఆరాధిస్తున్నారు. వారి కష్టాలను బాబా ఏదో రూపములో సహాయపడుతున్నారు.
బాబా వారి అనుగ్రహ బలం మరియు ఆశీర్వాదముతో ఒక పూజా విదానము రూపొందించాము. అది "శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం ". పదకొండు(11) గురువారాలు ఆచరించేలా, పదకొండు కథలతో వుంది. నియమ నిబందనలు సరళముగా వుంటాయి. ఒకసారి ఆచరించి చూడండి. బాబా అనుగ్రహము పొందండి.
శ్రద్ద,సబూరిలతో సాయిని పూజించుకుందాము. బాబా కృపాకటాక్షములు పొందుదాము.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book శ్రీసాయి ఏకాదశ గురువార వ్రతం - రెండవ విధానము (1 నుంచి 5 గురువారములు).