You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఇదిరామాయణం కాదు.
రామాయణం అందరికీ తెలుసు. వాల్మీకి మహర్షి రాశారు.
రాముడు ధర్మం కోసం పోరాడాడు. రావణుడు పడిపోయాడు.
సీతాదేవి తిరిగి వచ్చింది. ఆ కథ కాలాతీతమైనది — ముగింపు
మారదు, సత్యం మారదు.
కానీ ఆ యుద్ధంలో పోరాడిన లక్షల వానరులు? వారిలో ప్రతి
ఒక్కరికీ ఒక కథ ఉంది. ఒక తండ్రి. ఒక అమ్మ. ఒక ప్రేమ. ఒక
భయం. ఒక పాపం. ఒక పశ్చాత్తాపం. ఆ కథలు ఎవరూ
రాయలేదు.
శరభ వారిలో ఒకడు. అతను కేవలం మంచివాడు కాదు,
అలాగని చెడ్డవాడు అసలే కాదు. అతను ఒక మేధావి... కానీ
తన తెలివితేటలను స్వార్థానికేవాడుకున్నవాడు. ఆ స్వార్థానికి
అతను చెల్లించిన మూల్యం సామాన్యమైనది కాదు—అది తన
ప్రాణం కాదు, తను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన వారి
జీవితాలు. ఆ చేదు నిజాన్ని తెలుసుకుని, పశ్చాత్తాపంతో మళ్ళీ
పుట్టినవాడే ఈ శరభ.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book శరభ.