Description
“No miracle cures”.
Just tested protocols, honest lessons, and real hope for parents navigating autism and ADHD.
When a pharmaceutical scientist becomes the parent of a child with autism and ADHD, the journey takes an unexpected turn.
What begins as a search for medical answers transforms into a deeply personal exploration of diet, supplements, herbs, and behavioural strategies—practical tools that made a real difference.
In this heartfelt yet practical book, the author shares:
Lessons from trial and error — including popular alternative strategies that didn’t deliver, and why he shifted to approaches closer to naturopathy.
This is not a book of miracles.
It is a parent’s story of persistence, patience, and realistic hope—blending memoir with actionable insights.
By the end, you’ll gain both inspiration and a toolkit of protocols that may help your child find greater balance, relief, and calm.
If you’re searching for ways to support your child without over-relying on heavy medication, this book offers both guidance and hope—born from lived experience.
పుస్తక పరిచయం
విజ్ఞానశాస్త్రంలో ప్రతి ఆవిష్కరణ ఒక ప్రశ్నతో మొదలవుతుంది.
నాకు, ఆ ప్రశ్న చాలా వ్యక్తిగతమైనది: మా అబ్బాయి మందులపై ఆధారపడకుండా జీవించగలడా, నేర్చుకోగలడా, మరియు జీవితం లో ఎదగగలడా?
ఈ ప్రయాణంలో గడచిన సంవత్సరాలు మా అనుభవాలు శాస్త్రీయ పరిశోధనల తో కలగలిపినట్లు గా సాగాయి. మా ఇంట్లో చేసిన ప్రతి పరిశీలన ఒక ప్రయోగశాల లోని ప్రయోగం యొక్క విశ్లేషణాత్మక ఖచ్చితత్వాన్ని ప్రతిబింబించింది. కానీ పరిశోధనశాలల్లో ని ఫలితాల్లాగ కాకుండా నరేన్‌తో గడిపిన జీవితం ఊహించని వాటిని ఊహించడం నేర్పింది—ప్రతి చిన్నారి వారి అభిరుచులకనుగుణంగా స్పందిస్తారని, మరియు ప్రతి అడుగు ఓర్పు, పట్టుదలతోనే ముందుకు వేయాలని చూపింది.
'నరేన్ నా మార్గదర్శి' అనే ఈ పుస్తకం, మా అబ్బాయి తో ప్రయాణాన్ని ఒక క్రమబద్ధమైన మరియు అర్థవంతమైన పద్ధతిలో నమోదు చేయడానికి నేను చేసిన ప్రయత్నం. ఇది మా అభ్యాస దశలను ప్రతిబింబించే విభాగాలుగా విభజించబడింది—ప్రతి విభాగం నరేన్ ప్రగతిని తీర్చిదిద్దిన పజిల్‌లోని ఒక భాగాన్ని వివరిస్తుంది.
ఇందులో మీరు ఈ దిగువ చూపిన అంశాలపై చర్చలను గమనిస్తారు:
ఆహారం మరియు పోషణ - అవి ఆటిజం మరియు ఏడిహెచ్డి ఉన్న పిల్లల మానసిక స్థితి, ఏకాగ్రత, మరియు ప్రవర్తనలపై వాటి ప్రభావం. ఈ క్రమంలో వాటి సున్నితత్వాలను గుర్తించడం, మరియు ఈ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లో వాటి పాత్ర గురించి విపులంగా చర్చించబడింది.
సప్లిమెంట్లు మరియు సహజ చికిత్సలు – నరేన్ అభివృద్ధికి తోడ్పడిన కీలక పోషకాలు, మూలికలు మరియు సమ్మేళనాల వెనుక ఉన్న శాస్త్రం గురించి వివరణలు చూస్తారు.
పరిశీలన మరియు అనుసరణ – ద్వారా ప్రతిస్పందనలను ఎలా గమనించాలి, సూక్ష్మమైన సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలి మరియు కాలక్రమేణా వ్యూహాలను ఎలా సర్దుబాటు చేసుకోవాలి అనే వాటిని చర్చించడం జరిగింది.
ఈ అధ్యాయాలు పరిశోధన మరియు తార్కిక ఆలోచనలపై ఆధారపడినప్పటికీ, అవి అంతే స్థాయిలో వ్యక్తిగత అనుభవంపై కూడా ఆధారపడి ఉన్నాయి—ఏది పనిచేసింది, ఏది పనిచేయలేదు మరియు వేటి అంచనాలను పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది అనే విషయాలు గురించి కూడా వివరించబడింది.
ఈ పుస్తకం వ్రాయడం లో నా ఉద్దేశ్యం ఆటిజం మరియు ఏడిహెచ్డి ఉన్న పిల్లలకు ఒక సార్వత్రిక నివారణను అందించడం కాదు. కానీ వారి ప్రవర్తనలను నిర్వహించడంలో తల్లిదండ్రులు మరియు సంరక్షకులు మరింత సమాచారంతో కూడిన, వ్యక్తిగతీకరించిన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేయడం లో నా వ్యక్తిగత అనుభవాన్ని మరియు దృక్పథాన్ని పంచుకోవడం కోసం రాయబడింది.
ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరని గుర్తుంచుకోవడం ముఖ్యం. నరేన్‌కు సహాయపడినది మరొక బిడ్డకు అదే విధంగా పనిచేయకపోవచ్చు. ఈ పుస్తకాన్ని ఒక కుటుంబం యొక్క అనుభవానికి సంబంధించిన రికార్డుగా చదవాలి; ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు, దానికి సహయకం మాత్రమే.
దీని లక్ష్యం అవగాహన ద్వారా సాధికారత కల్పించడం, అంతే గానీ వృత్తి పరమైన వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు.
ముందటి అధ్యాయాలు మీరు చదువుతున్నప్పుడు, ఒక శాస్త్రవేత్త కొత్త ప్రయోగాన్ని ఎలా ప్రారంభిస్తాడో, అలాగే ఈ విషయాన్ని కూడా మీరు ఆసక్తి, జాగ్రత్త మరియు విశాల దృక్పథంతో చూడాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దీని లోని ఆలోచనలు మీకు సమాచారం అందించడమే కాకుండా, మీ బిడ్డను మరింత లోతుగా గమనించడానికి, మరింత సున్నితంగా ప్రశ్నించడానికి మరియు సహజ లేదా ప్రకృతి యొక్క నిశ్శబ్ద శక్తిని మరింత బలంగా విశ్వసించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయని నా ఆశ.
నేను నరేన్ పురోగతిని నమోదు చేయడం ప్రారంభించినప్పుడు, ప్రతి మెరుగుదల, అది ఎంత చిన్నదైనా, దానిక్కి కారణం మరియు ఫలితంపై లోతైన అవగాహన యొక్క ఫలితమేనని నేను గ్రహించాను.
రాత్రికి రాత్రే ఏదీ మారలేదు.
ప్రతీ పరిశీలన, ప్రతీ సర్దుబాటు, మరియు ప్రతీ చిన్న విజయం, నేను ఇప్పుడు 'మందులు లేని విధానం' అని పిలిచే దానికి పునాది వేశాయి.
ముందటి అధ్యాయాలలో, సాంప్రదాయ ఇంగ్లీషు చికిత్సకు అతీతంగా చూడమని మమ్మల్ని ప్రేరేపించిన తొలి సంకేతాలతో మొదలుపెట్టి, తరువాతి అధ్యాయాల్లో నేను ఎంచుకున్న విధానాలను వివరంగా వివరిస్తాను. ఈ ప్రయాణం సూక్ష్మమైన అభివృద్ధి సంకేతాలను గుర్తించడం నుండి మా రోజువారీ దినచర్యలను పునఃరూపకల్పన చేయడం వరకు, అన్నింటిలోను నరేన్ బాగుపడడానికి మనం అతనికి సహాయం చేయాలంటే, ముందుగా మనం అతన్ని అర్థం చేసుకోవాలి అనే ఒకే ఒక్క ధృఢమైన ఆలోచన తో ప్రారంభమైంది.
About The Author
Dr. Vara Prasad Chamakura, Ph.D.
Dr. Vara Prasad Chamakura earned his Ph.D. in Synthetic Organic Chemistry from Osmania University, India, in 1991. With more than three decades of experience in drug discovery and development, he has contributed extensively to the
fields of antiviral and anticancer research.
His work spans the design and development of anti-HIV and anti-HCV drugs, as well as the advancement of anticancer therapeutics. Notably, he was part of the team that successfully developed and transferred the technology of an anticancer drug, generating over five million U.S. dollars in proof-of-concept value, which later progressed as a lead candidate with a global multinational corporation.
His professional journey has taken him across the UK, USA, China, and India, with impactful contributions in both academia and industry.
He has authored and co-authored more than 40 research publications and patents in international journals and retired as a Research Director at a leading Contract Research Organization (CRO) in India, where he oversaw projects with net worth exceeding one million dollars.
Beyond his scientific career, Dr. Chamakura is a parent whose life took a profound turn when his son was diagnosed with autism at the age of five in 1998. With little initial knowledge of the disorder, he embarked on a journey of learning, discovery, and adaptation—guided, in many ways, by his son himself. His lived experience as both a scientist and a father forms the foundation of this book.
Driven by the belief that conventional medicine excels in emergencies but often falls short in addressing chronic conditions, Dr. Chamakura turned toward integrative, natural, and non-pharmaceutical approaches for managing autism and ADHD. His protocols—developed through years of observation, trial, and reflection—are shared here not as miracle cures, but as practical strategies that made a meaningful difference in his son’s life.
Through this work, Dr. Chamakura seeks to reach out to parents, caregivers, and communities, offering insights, encouragement, and alternative perspectives on supporting children with autism.
He continues to engage with forums, advocacy groups, and readers, with the aim of popularizing approaches that prioritize long-term well-being and resilience. This book is the first step in his broader mission to document, refine, these strategies in future publications.
He can be reached at vchamakura@hotmail.com for any queries in this regard.
రచయిత పరిచయం
డాక్టర్. చామకూర వరప్రసాద్, Ph.D.
డాక్టర్ చామకూర వరప్రసాద్ Indian Institute of Chemical Technology, Hyderabad లో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చేసిన పరిశోధనలు కొరకు తన పిహెచ్.డి ని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1991లో పొందారు. ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా ఔషధ ఆవిష్కరణ మరియు అభివృద్ధిలో విస్తృతమైన అనుభవం ఆయనకు కలదు.
ఆదేవిధంగా HIV మరియు HCV ఔషధాల రూపకల్పన మరియు అభివృద్ధి, అలాగే కాన్సర్ మందుల యొక్క అభివృద్ధిలో ఆయన విస్తృతంగా పని చేసారు. ముఖ్యంగా, ఒక క్యాన్సర్ నిరోధక ఔషధం యొక్క సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసి మరియు బదిలీ చేసిన బృందంలో ఎంతో కృషి చేసారు. ఆ ఔషధాల ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ విలువ అనేక మిలియన్ US డాలర్లకు పైగా ఉంటుంది. ఇది తరువాత ప్రపంచ బహుళజాతి సంస్థలో ఒక ప్రధాన ఔషధ అభ్యర్థిగా అభివృద్ధి చెందింది.
ఆయన వృత్తిపరమైన ప్రయాణం అతన్ని భారతదేశం లోనే కాకుండా UK, USA, మరియు చైనా అంతటా తీసుకువెళ్లింది, ఇది ఆయనకు విద్యారంగం మరియు పరిశ్రమలు రెండింటిలోనూ ప్రభావవంతం గా అభివృద్ధి చెందడానికి సహకారాన్ని అందించింది.
ఆయన అంతర్జాతీయ జర్నల్స్ లో 40 కంటే ఎక్కువ పరిశోధనా ప్రచురణలు మరియు పేటెంట్లను పొందారు. ఇంతే కాకుండా భారతదేశంలోని బెంగళూరు లో ప్రముఖ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CRO)లో రీసెర్చ్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసారు, అక్కడ ఆయన అనేక మిలియన్ డాలర్లకు మించిన నికర విలువ కలిగిన ప్రాజెక్ట్ లను పర్యవేక్షించారు.
అయితే ఆయన శాస్త్రీయ వృత్తికి మించి, డాక్టర్ చామకూర 1998లో తన కుమారుడికి ఐదేళ్ల వయసులో ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు ఆయన జీవితం తీవ్ర మలుపు తిరిగింది. దీంతో అప్పుడు ఆటిజం గురించి ఎక్కువగా తెలియకపోవడం వలన ఆయన సొంతంగా దాని గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, మరియు అనుసరణ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో అనేక విధాలుగా, తన కొడుకు కు స్వయంగా మార్గనిర్దేశం చేశారు. శాస్త్రవేత్తగా మరియు తండ్రిగా ఆయన ప్రత్యక్ష అనుభవం ఈ పుస్తకానికి పునాది.
సాంప్రదాయికంగా ఇంగ్లీషు మందులు అత్యవసర పరిస్థితుల్లో బాగా పనిచేస్తాయని అందరికి తెలిసిందే, అయితే దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో అతి తక్కువగా పనిచేస్తాయని అందరూ అనుకుంటారు మరియు ఇదే నిజం కూడా.
ఇందుచేత డాక్టర్ చామకూర కూడా ఆటిజం మరియు ADHD సమస్యలను అదుపులో ఉంచడానికి, సహజమైన మరియు నాన్-ఫార్మాస్యూటికల్ విధానాల వైపు మళ్లారు. ఇందుచేత ఆయన ప్రోటోకాల్ లు సంవత్సరాల పరిశీలన, మరియు విచారణ ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి అద్భుత నివారణలుగా కాకుండా, ఈ పుస్తకంలో తన కొడుకు జీవితంలో అర్ధవంతమైన వ్యత్యాసాన్ని కలిగించిన ఆచరణాత్మక వ్యూహాలును పంచుకున్నారు.
డాక్టర్ చామకూర ఈ పుస్తకం ఇటువంటి పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు సంఘాల సభ్యులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఆయన ఎప్పుడూ ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు మద్దతు ఇవ్వడంలో అనేక విధాలుగా, ప్రోత్సాహం మరియు ప్రత్యామ్నాయలను అందించడానికి ప్రయత్నస్తూనే ఉంటారు.
ఆయన ఆటిజం మరియు ADHD ఉన్న పిల్లలు లేదా పెద్దల దీర్ఘకాలిక శ్రేయస్సు మరియు స్థితిస్థాపకతకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో వివిధ ఫోరమ్ లు మరియు పాఠకులతో నిమగ్నమై ఉన్నారు. భవిష్యత్ ప్రచురణలలో ఈ వ్యూహాలను ప్రచురణ చేయడానికి మరియు మెరుగుపరచడానికి అతని విస్తృత మిషన్ లో ఈ పుస్తకం మొదటి అడుగు.
ఆయన్ను ఈ విషయంలో ఏవైనా సలహలు మరియు ప్రశ్నలకు vchamakura@hotmail.com ద్వారా సంప్రదించవచ్చు.