You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
మనస్సు నుండి పదార్థం వరకు, తత్వశాస్త్రం నుండి భౌతికశాస్త్రం వరకు , మతం నుండి హేతుబద్ధమైన ఆలోచన వరకు, జ్యోతిషశాస్త్రం నుండి ఖగోళ శాస్త్రం వరకు, బ్రహ్మాండం నుండి పిండాండం వరకు; ఈ పుస్తకం క్లుప్తంగా ప్రతిదానిపై అంతర్దృష్టిని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది!
ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తడానికి గల కారణాన్ని ప్రాచీన కాలం నుండి వివిధ మత మరియు తాత్విక సిద్ధాంతాల ద్వారా వివరించబడింది. అయితే ఆధునిక కాలంలో ఈ విషయం ప్రధానంగా రెండు వేర్వేరు శీర్షికల క్రింద వివరించబడింది; విజ్ఞాన శాస్త్రం మరియు తత్వ శాస్త్రం! రెండువేల సంవత్సరాల నుండి (గ్రీకు దేశంలోని అరిస్టాటిల్ కాలం నుండి, ఈ విశ్వంలోని ప్రతి విషయం గురించి "ఎందుకు" మరియు "ఎలా" అనే ప్రశ్నలకు తత్వవేత్తలు మరియు శాస్త్రవేత్తలు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, రెండు వర్గాల వాళ్ళు సమాధానాలు వెదుకుచూ వ్యతిరేక దిశల్లో తమ తమ సుదీర్ఘ యాత్ర చేస్తున్నట్లు కనిపిస్తుంది.
బహుశా ఆధునిక విజ్ఞాన శాస్త్రం, తత్వవేత్తలకు మరీ క్లిష్టంగా మారడం ప్రారంభించి ఉండవచ్చు! అలాగే శాస్త్రవేత్తలు తత్త్వ శాస్త్రం గురించి ఆలోచించడం తమ పని కాదనే ధోరణిలో ఉండిపోయారు. కాబట్టి ఆధునిక కాలపు ఆలోచనా విధానాన్ని ప్రాచీన శాస్త్రాలలో ఈ విశ్వం గురించి చెప్పబడిన సత్యాలతో కలిపి మేళవించడానికి ఈ పుస్తకంలో ఒక చిన్న ప్రయత్నం జరిగింది.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Mahamaya - Telugu.