You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

Mahamaya - Telugu

Colonel T Sreenivasulu
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹295 + shipping
Price: ₹295 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

మనస్సు నుండి పదార్థం వరకు, తత్వశాస్త్రం నుండి భౌతికశాస్త్రం వరకు , మతం నుండి హేతుబద్ధమైన ఆలోచన వరకు, జ్యోతిషశాస్త్రం నుండి ఖగోళ శాస్త్రం వరకు, బ్రహ్మాండం నుండి పిండాండం వరకు; ఈ పుస్తకం క్లుప్తంగా ప్రతిదానిపై అంతర్దృష్టిని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది!
ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తడానికి గల కారణాన్ని ప్రాచీన కాలం నుండి వివిధ మత మరియు తాత్విక సిద్ధాంతాల ద్వారా వివరించబడింది. అయితే ఆధునిక కాలంలో ఈ విషయం ప్రధానంగా రెండు వేర్వేరు శీర్షికల క్రింద వివరించబడింది; విజ్ఞాన శాస్త్రం మరియు తత్వ శాస్త్రం! రెండువేల సంవత్సరాల నుండి (గ్రీకు దేశంలోని అరిస్టాటిల్ కాలం నుండి, ఈ విశ్వంలోని ప్రతి విషయం గురించి "ఎందుకు" మరియు "ఎలా" అనే ప్రశ్నలకు తత్వవేత్తలు మరియు శాస్త్రవేత్తలు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, రెండు వర్గాల వాళ్ళు సమాధానాలు వెదుకుచూ వ్యతిరేక దిశల్లో తమ తమ సుదీర్ఘ యాత్ర చేస్తున్నట్లు కనిపిస్తుంది.
బహుశా ఆధునిక విజ్ఞాన శాస్త్రం, తత్వవేత్తలకు మరీ క్లిష్టంగా మారడం ప్రారంభించి ఉండవచ్చు! అలాగే శాస్త్రవేత్తలు తత్త్వ శాస్త్రం గురించి ఆలోచించడం తమ పని కాదనే ధోరణిలో ఉండిపోయారు. కాబట్టి ఆధునిక కాలపు ఆలోచనా విధానాన్ని ప్రాచీన శాస్త్రాలలో ఈ విశ్వం గురించి చెప్పబడిన సత్యాలతో కలిపి మేళవించడానికి ఈ పుస్తకంలో ఒక చిన్న ప్రయత్నం జరిగింది.

About the Author

రచయిత సైనిక్ స్కూల్ కోరుకొండ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ వంటి భారతదేశంలోని కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలలో చదివిన పూర్వ విద్యార్థి. రాక్ క్లైంబింగ్ మరియు పర్వతారోహణం వంటి క్రీడలలో ఉన్న ఆసక్తి కారణంగా, పదిహేనేళ్ళ వయసులోనే అతను హిమాలయ పర్వత శ్రేణులు మరియు గంగా నది యొక్క జన్మ స్థానం వైపు ఆకర్షితుడయ్యాడు. రెండు వేల కిలోమీటర్ల అతని సుదీర్ఘ ప్రయాణం పూర్తిగా వేరే ప్రయాణానికి దారితీసింది. అతను ప్రయాణం చేస్తున్న అదే రైలు పెట్టెలోనే హిమాలయ పర్వత శ్రేణులలో తపస్సు చేసుకుంటున్న తన భావి గురుదేవులతో పరిచయం జరిగింది! అతని ప్రయాణం ముందు నుండే లిఖించబడిన విధిరాత అనే విషయం ఆ సమయంలో ఆ బాలునికి తెలియదు! రచయిత ప్రస్తుతం భారత సైన్యంలో సైనికాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన శక్తిపాత్ పరంపరలో ఒక పరమ గురువు కూడా! ప్రపంచవ్యాప్తంగా శక్తిపాత్ దీక్షలు ఇస్తున్న గురువులు కొంతమంది స్వయంగా ఆయన శిష్యులే!

Book Details

Number of Pages: 147
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

Mahamaya - Telugu

Mahamaya - Telugu

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Mahamaya - Telugu.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.