You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ప్రస్తుతం నడుస్తున్న OTT ,AI ప్రపంచంలో,విద్యార్థులు కూడా, క్లాసు పుస్తకాలు చదవడానికి బదులు వీడియోలు చూస్తున్న కాలంలో,ఈ పుస్తకంలోని హాస్య రచనలని చదవమని చెప్పడం ఒక పెద్ద కామెడీ.ఈ పుస్తకంలో రెండు భాగాలున్నాయి.ఒకటి ఎస్ ఎస్ వి రమణరావు రచించిన హాస్యకథలు,రచనలు.ఎక్కువగా రచన మాసపత్రికలోనూ,ఒక నవ్య పత్రిక రచన, ఒక కౌముది రచన, పెద్ద రచయితలు మెచ్చుకున్న కొన్ని ఫేస్ బుక్ పోస్టులు.రెండవ భాగంలో ఎన్.ప్.శ్రీనివాస రావు ,న్యూజిలాండ్,కార్టూనిస్టుగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు.ఆయన రచించిన కొన్ని ప్రసిద్ధి చెందిన, పాత, కొత్త తెలుగు పాటల పారడీలు.అన్నీ హాస్యానందం మాసపత్రికలో ప్రచురించబడి అందరి ఆహ్లాదానికి నోచుకున్నవే.కొన్ని భావాలు రాతలో చెప్పినంత గొప్పగా చూపించలేం.మరికొన్ని భావాలు చూపించినంత గొప్పగా రాయలేం.దేని గొప్ప దానిదే.చదివేటప్పుడు కొంచెం బుర్రకి పని అంటే కొంచెం శ్రమ ఉంటుంది,చూసేటప్పుడు కంటే.అందుకనే అందరూ చూడడానికి ఇష్టపడుతున్నారు.ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ,రచనలతో పాటు,బొమ్మలతో,కవర్ పేజీతో సహా పాఠకులు సులభంగా చదవడాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్చి దిద్దడం జరిగింది. కొంత చదవడం ద్వారా,కొంత చూడడం ద్వారా,కొంత ఊహించుకోవడం ద్వారా,అందం చింది,ఆహ్లాదం చెంది,ఆనందం పొంది,పుస్తకంతో పాటు,సంతోషాన్ని కూడా సొంతం చేసుకుంటారని నమ్ముతూ
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book హాస్య కథనాలు-కవనాలు.