You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
పరిచయం:
అపొస్తలుడైన పౌలు వ్రాసిన థెస్సలొనీక పత్రికల అధ్యయనానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ పత్రికలు కొత్త నిబంధనలోని అన్ని రాతలలో చాలా ప్రారంభ కాలానికి చెందినవి మరియు బహుశా గలతీయులకు వ్రాసిన పత్రిక మినహాయిస్తే, పౌలు యొక్క మొట్టమొదటి రచనలు కావచ్చు. పౌలు తన రెండవ యాత్రలో ఉన్నప్పుడు థెస్సలొనీక పట్టణానికి వచ్చి, సువార్తను ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఈ అధ్యయనానికి నేపథ్యంగా థెస్సలొనీక పట్టణంలో పౌలు, సీల మరియు తిమోతిల ప్రసంగం గురించి అపొస్తలుల కార్యములు 17:1–15 చదవండి.
పాఠ్య భాగం: అపొస్తలుల కార్యములు 17:1–15
పాఠం యొక్క లక్ష్యం: థెస్సలొనీకలో సంఘం ఎలా మరియు ఎప్పుడు స్థాపించబడిందో అవగాహన చేసుకోవడం.
పాఠం యొక్క ఉద్దేశ్యాలు: మీరు . . .
1. థెస్సలొనీక పట్టణానికి మొదట సువార్తను తెచ్చిన వారు పౌలు, సీల మరియు తిమోతి అని తెలుసుకుంటారు.
2. థెస్సలొనీక పట్టణ నిర్మాణం యొక్క కొన్ని భౌతిక లక్షణాలను చూస్తారు.
3. పౌలు ఒక పట్టణంలోకి ప్రవేశించినప్పుడు మొదట యూదుల సమాజ మందిరాలలో ప్రసంగించడం ఆయన అలవాటు అని గమనిస్తారు.
4. థెస్సలొనీకలో సువార్త ప్రకటనకు ప్రతిస్పందన సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఉందని గమనిస్తారు – యూదులు మరియు అన్యజనుల నుండి మారుమనస్సు పొందిన వారు, అలాగే యూదుల నుండి వ్యతిరేకత.
5. థెస్సలొనీకలోని సంఘానికి ఈ పత్రిక రాయడంలో పౌలు ఉద్దేశ్యాన్ని తెలియజేసే ఆరు వాక్యాలను తెలుసుకుంటారు.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book 1 &2 థెస్సలొనీక -" First & Second Thessalonians".