You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
నేను అనుభవించిన ప్రతి సందర్భం ఒక గొప్ప వాక్యంగా నిలవాలని, ఒక భావాన్ని అత్యంత అందంగా, హృదయానికి హత్తుకునేలా వ్యక్తీకరించగల శక్తి కవిత్వానికే ఉందని, అంతేకాదు ఈ ప్రపంచాన్ని ఆలోచింపజేసి మార్పు దిశగా నడిపించగల సామర్థ్యం కూడా కవిత్వానిదేనని నేను దృఢంగా విశ్వసిస్తాను.
2014 నుండి 2021 వరకు నేను రాసిన కవితల సమాహారమే 'నిశ్శబ్ద స్వప్నం' కవితా సంపుటి. ఈ సంపుటిలో కూతురు, అమ్మ, నాన్న, తెలుగుభాష, స్నేహం, గురువులు, పనిపిల్ల, అలాగే సమాజంలోనూ వ్యవస్థలోనూ జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు వంటి అనేక అంశాలను కవిత్వ రూపంలో ఆవిష్కరించాను. జీవితంలోని విభిన్న అనుభూతులను, మానవ సంబంధాల లోతులను, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే కవితల సమాహారమే 'నిశ్శబ్ద స్వప్నం'.
ఈ కవితా సంపుటిని మీ చేతుల్లోకి అందిస్తున్న ఈ సందర్భంగా, మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
– చిత్రాడ కిషోర్ కుమార్
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book నిశ్శబ్ద స్వప్నం (Nisshabda Swapnam).