You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review
Type: e-book
Genre: Poetry
Language: Telugu
Price: ₹60
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

హృదయాం పలికిన భావాలకు అక్షర రూపమే "హృదయాలాపన".

ఈ పుస్తకంలోని కవితలు దాదాపు 1989 నుండి 2013 వరకు నా మనసులో పుట్టిన అనుభూతులకు ప్రతిబింబం. ప్రేమలోని మాధుర్యం, స్నేహంలోని ఆప్యాయత, జ్ఞాపకాల తీపి-చేదు క్షణాలు, అనుబంధాల ఆత్మీయత ఈ కవిత్వంలో మమేకమై ఉన్నాయి.

వ్యక్తిగత భావోద్వేగాలతో పాటు సమాజాన్ని స్పృశించిన ఎన్నో అంశాలు కూడా ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. కోనసీమ ప్రజల జీవితాలను కుదిపేసిన తుఫాను, చార్ ధామ్ యాత్రలో చోటుచేసుకున్న విషాద సంఘటనలు, నగర జీవితపు పరుగులు, మనుషుల మధ్య మారుతున్న సంబంధాలు వంటి అనేక విషయాలు ఈ కవితల్లో హృదయాన్ని తాకేలా ఆవిష్కరించబడ్డాయి.

ఈ కవితలను చదువుతున్నప్పుడు మీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు, కళాశాల రోజుల అనుభవాలు, జీవిత ప్రయాణంలో మిమ్మల్ని తాకిన అనేక సంఘటనలు సహజంగానే మీ మనసులో మెదులుతాయని నేను విశ్వసిస్తున్నాను.

"హృదయాలాపన" కేవలం కవితల సంకలనం మాత్రమే కాదు; కాలంతో పాటు నడిచిన అనుభూతుల ప్రయాణం, మనసు మాటలకు అక్షరాల రూపం, ప్రతి పాఠకుడి హృదయంతో సంభాషించే ఒక ఆత్మీయ పలకరింపు.

తప్పక చదువుతారని ఆశిస్తున్నాను

About the Author

చిత్రాడ కిషోర్ కుమార్ 1969 ఫిబ్రవరి 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా, బూరగాం గ్రామంలో శ్రీ చిత్రాడ రామారావు (విరమణ పొందిన ఉపాధ్యాయులు), శ్రీమతి స్వరాజ్యలక్ష్మి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు.

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యలను బూరగాం, సోంపేట, బారువ (శ్రీకాకుళం జిల్లా) ప్రాంతాల్లో అభ్యసించారు. అనంతరం బారువలో డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్‌లో కంప్యూటర్స్, టెస్టింగ్ టూల్స్, గ్రాఫిక్ డిజైనింగ్ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. మనసులో నిక్షిప్తమైన భావాలకు అక్షరరూపం ఇవ్వాలనే తపనతో రూపుదిద్దుకున్న తొలి కవిత "స్నేహం" ద్వారా 1989లో ఆయన కవితా ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం ప్రచురితమైన తొలి కవిత "భారగీతం" 1990 మార్చి 22న ఆంధ్రప్రభ దినపత్రికలో వెలువడి, సాహిత్యరంగంలో ఆయనకు తొలి గుర్తింపును తీసుకొచ్చింది.

మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న తన సాహిత్య ప్రస్థానంలో కవిత్వం, నాటకం, దేశభక్తి గేయం, సూక్తులు (కోట్స్) వంటి అనేక ప్రక్రియల్లో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక సమస్యలు, అసమానతలు, సమాజ చైతన్యం, మానవతా విలువలు, పర్యావరణ పరిరక్షణ, జీవన తాత్త్వికత, దేశభక్తి వంటి విభిన్న అంశాలపై స్పందిస్తూ సృజనాత్మక రచనలు కొనసాగిస్తున్నారు.

Book Details

Publisher: Malleteega Prachuranalu
Number of Pages: 74
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

హృదయాలాపన (Hrudayalapana)

హృదయాలాపన (Hrudayalapana)

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book హృదయాలాపన (Hrudayalapana).

Other Books in Poetry

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.