You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
డా|| యస్.వి.యస్.కిషోర్ కుమార్ నలభై ఏళ్ళుగా తెలుగు సాహితీ రంగంలో సుపరిచితులు. వచన కవిత్వానికి సృజనాత్మకతను జోడించి తనదైన శైలితో చదువరులను ఆకట్టుకోగల సమర్ధులు. బాంకింగ్ రంగంలో పనిచేస్తున్నప్పటికి తెలుగు భాషాభిమానంతో కవితలు రాయడంలో తన వంతు కృషి చేశారు. చదువుకునే రోజుల్లో ‘రావాలి నవచైతన్యం’ అనే కవితతో ఆరంభించిన తన కవితా ప్రస్థానం నేటికీ జీవనదిలా సాగుతూనే వుంది. ‘అంతర్లీనం’, ‘ఆలోచనలు’, ‘నివేదన’, ‘నా చిన్ని ప్రపంచం’, ‘మనమిద్దరం సమాంతర రేఖలం’, ‘నమ్మకపు గాయాలు’ కవితలలో తన రచనా శైలిని ప్రదర్శించి వచన కవిత్వంలో క్రొత్త ఒరవడి సృష్టించారు. ప్రతి కవిత జీవన సత్యాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తుంది. రచయిత కలం నుండి మరిన్ని కవితలు రావాలని ఆశిస్తూ, “అక్షర సుమాంజలి” తెలుగు సాహితీవనంలో తన పరిమళాలను వెదజల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆచార్య గుర్రం ఉమాదేవి
విశ్రాంత ఆచార్యులు, తెలుగు విభాగం
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book అక్షర సుమాంజలి (కవితా సంకలనం).