You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

అక్షర సుమాంజలి (కవితా సంకలనం) (eBook)

Type: e-book
Genre: Poetry, Entertainment
Language: Telugu
Price: ₹50
Available Formats: PDF, EPUB Immediate Download on Full Payment

Description

డా|| యస్.వి.యస్.కిషోర్ కుమార్ నలభై ఏళ్ళుగా తెలుగు సాహితీ రంగంలో సుపరిచితులు. వచన కవిత్వానికి సృజనాత్మకతను జోడించి తనదైన శైలితో చదువరులను ఆకట్టుకోగల సమర్ధులు. బాంకింగ్ రంగంలో పనిచేస్తున్నప్పటికి తెలుగు భాషాభిమానంతో కవితలు రాయడంలో తన వంతు కృషి చేశారు. చదువుకునే రోజుల్లో ‘రావాలి నవచైతన్యం’ అనే కవితతో ఆరంభించిన తన కవితా ప్రస్థానం నేటికీ జీవనదిలా సాగుతూనే వుంది. ‘అంతర్లీనం’, ‘ఆలోచనలు’, ‘నివేదన’, ‘నా చిన్ని ప్రపంచం’, ‘మనమిద్దరం సమాంతర రేఖలం’, ‘నమ్మకపు గాయాలు’ కవితలలో తన రచనా శైలిని ప్రదర్శించి వచన కవిత్వంలో క్రొత్త ఒరవడి సృష్టించారు. ప్రతి కవిత జీవన సత్యాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తుంది. రచయిత కలం నుండి మరిన్ని కవితలు రావాలని ఆశిస్తూ, “అక్షర సుమాంజలి” తెలుగు సాహితీవనంలో తన పరిమళాలను వెదజల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆచార్య గుర్రం ఉమాదేవి
విశ్రాంత ఆచార్యులు, తెలుగు విభాగం

About the Author

తెలుగు గడ్డపై పుట్టడం నిజంగా నా పూర్వజన్మ పుణ్యఫలం. తెలుగు భాషంటే మిక్కిలి మక్కువ నాకు. కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. తెలుగు కవుల అడుగుజాడల్లో నడవాలని చిన్నప్పటినుండి కోరిక. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాష నా ఊపిరి. చదువుకునే రోజులనుండి చిన్న చిన్న కవితలు రాసుకుంటూ 'భారతి’ వంటి సాహితీ పత్రికలలో అవి అచ్చయినపుడు చూసి మురిసిపోయేవాడిని. ముఖ్యంగా శ్రీ సి.నారాయణరెడ్డి గారి కవిత ప్రక్కన నాకవిత అచ్చయినపుడు ఆనందంతో ఎగిరి గెంతేసేవాడిని. 1977 లో నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ‘రావాలి నవ చైతన్యం’ అనే నా కవిత మా యస్.జి.యస్.ఆర్ట్స్ కాలేజి, తిరుపతి మాగజిన్ లో అచ్చయింది. మా తెలుగు లెక్చరర్ శ్రీ త్రిపురనేని మధుసూధనరావు గారు పిలిచి మరీ అభినందించి నన్ను ప్ర్రోత్సహించారు. 1981 లో ఆంధ్రాబాంక్ లో చేరిన తరువాత ఆంధ్రాబాంక్ త్రైమాసిక పత్రికలో క్రమం తప్పకుండా నా కవితలు, కధానికలు ప్రచురింపబడేవి. పలుమార్లు ప్రధమ బహుమతి లభించింది కూడా. కొన్ని కవితలు, కధానికలు తిరుపతి ఆల్ ఇండియా రేడియోలో చదివే అవకాశం దొరికింది. నాకవితలపై పద్మభూషణ్ శ్రీ సి.నారాయణరెడ్డి గారి ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం.
ఈ నలభై ఏళ్ళలో నేను రాసిన కొన్ని కవితలను “అక్షర సుమాంజలి’‘ అనే పుస్తక రూపంలో పొందుపరుస్తున్నాను.
స్వామీ వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. వివేకానందుడు గొప్ప తాత్వికుడు. ఆయన దివ్య ప్రబోధాలను ప్రతి కవిత చివరన ఉద్ఘాటించాను.

Book Details

Number of Pages: 105
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

అక్షర సుమాంజలి (కవితా సంకలనం)

అక్షర సుమాంజలి (కవితా సంకలనం)

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book అక్షర సుమాంజలి (కవితా సంకలనం).

Other Books in Poetry, Entertainment

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.