You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
భారతదేశం, భక్తి అనేవి అవిభక్త కవలలు. భక్తి ఒక పవిత్రమైన భావన. ఆధ్యాత్మికత అంతులేని విశ్వాసాన్నిస్తుంది. హిందుత్వ అనేది ఒక జీవన విధానం. మన హైందవజాతికి ఆధ్యాత్మిక పురాణాలే పట్టుకొమ్మలు. మన పూర్వీకులు రచించిన ఎన్నో భక్తిగ్రంధాలు నేటి మనజీవనానికి ఆలంబనయ్యాయి. మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత, ఏకాగ్రతను పెంపొందిస్తున్నాయి. మన హిందూపురాణాల ఆవిర్భావం కొన్నివందల ఏళ్ళైనా వాటి సారాంశం మాత్రం నిత్యనూతనంగా అజరామరంగా అలరారుతున్నాయి. ఆధ్యాత్మిక మార్గం లోనున్న చిత్రం ఏమిటంటే అందరి అనుభవాలు నిర్దిష్టమైనవే అయినా వర్ణనకు అతీతం. అంటే మాటలలో చెప్పలేము.
ఈపుస్తకం కేవలం భక్తిభావన ఆస్వాదించడానికి మాత్రమే.
మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి, అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో భక్తివిషయాలు పంచుకుంటున్న హిందూ ఆత్మీయులందరికి ఆ భగవంతుని కృప ఎల్లవేళలా ప్రసాదింపబడాలని ప్రార్ధిస్తున్నాను.
సర్వేజనా సుఖినో భవంతు
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ఆధ్యాత్మికం.