You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review
Type: e-book
Genre: Literature & Fiction, Religion & Spirituality
Language: Telugu
Price: ₹0
Available Formats: PDF, EPUB

Description

భారతదేశం, భక్తి అనేవి అవిభక్త కవలలు. భక్తి ఒక పవిత్రమైన భావన. ఆధ్యాత్మికత అంతులేని విశ్వాసాన్నిస్తుంది. హిందుత్వ అనేది ఒక జీవన విధానం. మన హైందవజాతికి ఆధ్యాత్మిక పురాణాలే పట్టుకొమ్మలు. మన పూర్వీకులు రచించిన ఎన్నో భక్తిగ్రంధాలు నేటి మనజీవనానికి ఆలంబనయ్యాయి. మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత, ఏకాగ్రతను పెంపొందిస్తున్నాయి. మన హిందూపురాణాల ఆవిర్భావం కొన్నివందల ఏళ్ళైనా వాటి సారాంశం మాత్రం నిత్యనూతనంగా అజరామరంగా అలరారుతున్నాయి. ఆధ్యాత్మిక మార్గం లోనున్న చిత్రం ఏమిటంటే అందరి అనుభవాలు నిర్దిష్టమైనవే అయినా వర్ణనకు అతీతం. అంటే మాటలలో చెప్పలేము.
ఈపుస్తకం కేవలం భక్తిభావన ఆస్వాదించడానికి మాత్రమే.
మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి, అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో భక్తివిషయాలు పంచుకుంటున్న హిందూ ఆత్మీయులందరికి ఆ భగవంతుని కృప ఎల్లవేళలా ప్రసాదింపబడాలని ప్రార్ధిస్తున్నాను.
సర్వేజనా సుఖినో భవంతు

About the Author

డా.యస్.వి.యస్.కిషోర్ కుమార్ నలభై ఏళ్ళుగా తెలుగు సాహితీ రంగంలో సుపరిచితులు. తన రచనలన్నిటిలో సృజనాత్మకతను జోడించి తనదైన శైలితో చదువరులను ఆకట్టుకోగల సమర్ధులు. బాంకింగ్ రంగంలో పనిచేసి ప్రస్తుతం లాయర్ గా తన వృత్తి కొనసాగిస్తున్నప్పటికీ తెలుగు భాష అంటే మక్కువ, ప్రేమ, అభిమానంతో అడపా దడపా మంచి రచనలు చేస్తూ పాఠకులలో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు భాషాభిమానంతో కవితలు, కధలు, నవలలు, సీరియల్స్ రాయడంలో తన వంతు కృషి చేస్తున్నారు. తన రచనలు జీవితం లోతులనుంచి వెలికి తీసినట్లుంటాయి. సామాజిక స్పృహతో రచనలు చేయడం అతని అభిలాష. అతని రచనలలో వినోదం పాలు ఎక్కువగా ఉంటుంది. ఏది రాసినా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలన్నదే అతని ఆకాంక్ష. ఆంగ్ల భాషలో బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజిమెంట్ మొదలగు అంశాలపై పలు పుస్తకాలు రాశారు. ఆంగ్ల భాషలో యాదాద్రి, లార్డ్ బాలాజీ, ఓం సాయి శ్రీ సాయి మొదలగు భక్తి పుస్తకాలు రాశారు.

Book Details

Number of Pages: 304
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

ఆధ్యాత్మికం

ఆధ్యాత్మికం

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book ఆధ్యాత్మికం.

Other Books in Literature & Fiction, Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.