You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
‘మిథునం’ అన్న పేరుతో ఉన్న ఈ కధా సంపుటిలో రచయిత చక్కని కథలు వెలువరించారు. అన్ని కథలూ ఆణిముత్యాలే.
కీ.శే. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారితో రచయితకున్న చనువు పురస్కరించుకుని ఆ మహనీయుని గురించి చక్కటి రచనలను ఇందులో పొందుపరిచారు. ‘మిథునం’ కథలో తన చిన్ననాటి స్నేహితురాలి జాడ తెలియడం, ఆమె ఉన్న దీన స్థితి నుంచి ఆమెకు తన సహధర్మచారిణిగా ఒక గౌరవం ఇవ్వడం, వాలే పొద్దు వయసులో వారి అన్యోన్యత గురించి అద్భుతంగా కధనం చేశారు. ‘స్నేహితులు’ కథలో స్నేహ ధర్మం గురించి చక్కగా చెప్పారు. ‘స్నేహమాధుర్యం’ లో ఒక గొప్పింటి అమ్మాయి ఓ పేదరాలి నుంచి నేర్చుకున్న జీవన సత్యాన్ని దానివలన తాను పొందిన మానసిక సంతోషాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. ‘ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసంవరకు’ లో ఒక మహిళ చనిపోయే ప్రయత్నంలో ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమింపచేసి ఆమెకు నిజ జీవితంలో ఎలా సుఖంగా గడపాలో కనువిప్పు కలిగించేలా చేసిన రచన చక్కగా ఉంటుంది. ‘అన్యోన్య దాంపత్యానికి అందమైన చిరునామా’ అన్న కథలో భార్యా భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు లోపాలు ఎత్తి చూపాలని ప్రయత్నించి విఫలమై తామిద్దరూ ఒకటే అన్న భావనతో ఆనందాన్ని పంచుకుంటారు.
‘పెళ్ళంటే....ఒకే వ్యక్తితో ప్రతిరోజూ ప్రేమలో పడటమే......’ అన్న ఈ చిట్టి కథలో ఒకే వ్యక్తితో ప్రతిరోజూ ప్రేమలో పడటమే పెళ్ళంటే అని మధుర భాష్యం చెప్పారు. ‘నిండు సంసారం’ లో ఓ ఆదర్శ కుటుంబం గురించి గొప్పగా ప్రదర్శించారు. ‘మంచి మనసుకు మంచి రోజులు’ కథలో ఓ ఇల్లాలి ఆత్మీయత, అనురాగం, ఎదుటివారికి సహాయంచేసే గొప్ప గుణం చక్కగా వివరించారు. ‘మంచి మనుషులు’ కథలో ఓ అల్లుడు తన అత్తమామలను తల్లితండ్రులతో సమానంగా తన దగ్గరే ఉంచి కొడుకులా చూసుకునే ఓ మంచి వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా చూపించారు. ‘జార్జెట్ చీర’ కథలో ఆడవారి మమతానురాగాలకు అద్దం పట్టారు. ‘ముగ్గురమ్మాయిలు’ లో ప్రయాణంలో జరిగే కొన్ని వినోదాత్మక సన్నివేశాలను సరదాగా మలచారు. ‘సహనం’ లో భూదేవి కున్న సహజ గుణాన్ని అందరూ అలవర్చుకోవాలన్న సందేశాన్నిచ్చారు. అన్ని కథలలోనూ శ్రీ కిషోర్ కుమార్ గారు తన సహజ శైలిని ప్రదర్శిస్తూ, జీవితంలో ఉపయోగపడే విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపించి పాఠకుల మనసులను చూరగొన్నారు. అందుకు వారు ఎంతైనా అభినందనీయులు.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book మిథునం (కథా సంపుటి).