You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

మిథునం (కథా సంపుటి) (eBook)

Type: e-book
Genre: Humor, Entertainment
Language: Telugu
Price: ₹50
(Immediate Access on Full Payment)
Available Formats: PDF, EPUB

Description

‘మిథునం’ అన్న పేరుతో ఉన్న ఈ కధా సంపుటిలో రచయిత చక్కని కథలు వెలువరించారు. అన్ని కథలూ ఆణిముత్యాలే.
కీ.శే. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారితో రచయితకున్న చనువు పురస్కరించుకుని ఆ మహనీయుని గురించి చక్కటి రచనలను ఇందులో పొందుపరిచారు. ‘మిథునం’ కథలో తన చిన్ననాటి స్నేహితురాలి జాడ తెలియడం, ఆమె ఉన్న దీన స్థితి నుంచి ఆమెకు తన సహధర్మచారిణిగా ఒక గౌరవం ఇవ్వడం, వాలే పొద్దు వయసులో వారి అన్యోన్యత గురించి అద్భుతంగా కధనం చేశారు. ‘స్నేహితులు’ కథలో స్నేహ ధర్మం గురించి చక్కగా చెప్పారు. ‘స్నేహమాధుర్యం’ లో ఒక గొప్పింటి అమ్మాయి ఓ పేదరాలి నుంచి నేర్చుకున్న జీవన సత్యాన్ని దానివలన తాను పొందిన మానసిక సంతోషాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. ‘ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసంవరకు’ లో ఒక మహిళ చనిపోయే ప్రయత్నంలో ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమింపచేసి ఆమెకు నిజ జీవితంలో ఎలా సుఖంగా గడపాలో కనువిప్పు కలిగించేలా చేసిన రచన చక్కగా ఉంటుంది. ‘అన్యోన్య దాంపత్యానికి అందమైన చిరునామా’ అన్న కథలో భార్యా భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు లోపాలు ఎత్తి చూపాలని ప్రయత్నించి విఫలమై తామిద్దరూ ఒకటే అన్న భావనతో ఆనందాన్ని పంచుకుంటారు.
‘పెళ్ళంటే....ఒకే వ్యక్తితో ప్రతిరోజూ ప్రేమలో పడటమే......’ అన్న ఈ చిట్టి కథలో ఒకే వ్యక్తితో ప్రతిరోజూ ప్రేమలో పడటమే పెళ్ళంటే అని మధుర భాష్యం చెప్పారు. ‘నిండు సంసారం’ లో ఓ ఆదర్శ కుటుంబం గురించి గొప్పగా ప్రదర్శించారు. ‘మంచి మనసుకు మంచి రోజులు’ కథలో ఓ ఇల్లాలి ఆత్మీయత, అనురాగం, ఎదుటివారికి సహాయంచేసే గొప్ప గుణం చక్కగా వివరించారు. ‘మంచి మనుషులు’ కథలో ఓ అల్లుడు తన అత్తమామలను తల్లితండ్రులతో సమానంగా తన దగ్గరే ఉంచి కొడుకులా చూసుకునే ఓ మంచి వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా చూపించారు. ‘జార్జెట్ చీర’ కథలో ఆడవారి మమతానురాగాలకు అద్దం పట్టారు. ‘ముగ్గురమ్మాయిలు’ లో ప్రయాణంలో జరిగే కొన్ని వినోదాత్మక సన్నివేశాలను సరదాగా మలచారు. ‘సహనం’ లో భూదేవి కున్న సహజ గుణాన్ని అందరూ అలవర్చుకోవాలన్న సందేశాన్నిచ్చారు. అన్ని కథలలోనూ శ్రీ కిషోర్ కుమార్ గారు తన సహజ శైలిని ప్రదర్శిస్తూ, జీవితంలో ఉపయోగపడే విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపించి పాఠకుల మనసులను చూరగొన్నారు. అందుకు వారు ఎంతైనా అభినందనీయులు.

About the Author

తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం. భాషలోని స్పష్టత, అక్షర రమ్యత, నేర్పు, భావం, కూర్పు, వర్ణనే ఓ అద్భుతం. చిన్నప్పటినుంచి తెలుగు భాషపై ప్రేమతో రచనలు మొదలుపెట్టాను. కవితలు, కథలు, సీరియల్స్, నవలలు రాయడం దినచర్యలో ఒక భాగమైంది. బ్యాంకు లో ముప్పై ఐదు సంవత్సరాలు వివిధ హోదాలలో పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్, హైదరాబాద్ లో న్యాయవాద వృత్తి కొనసాగిస్తున్నాను. సామాజిక స్పృహ కలిగిన రచనలు చేయాలన్నదే నా ఆశయం. అందరూ సుఖంగా ఉండాలి అన్న భావన నా రచనల్లో కనిపించేలా చెయ్యడం నా లక్ష్యం. అందుకే ఎక్కువ రచనలు అన్నది నాకు ముఖ్యం కాదు. నా రచనలు చదివిన పాఠకులకు కాస్తంత ఆనందం కలిగిస్తే నా కోరిక నెరవేరినట్లే. ఇందులో కథలన్నీ నేటి జీవనానికి అద్దం పడుతాయి. ఈ పుస్తకం త్వరగా పాఠకుల ముందుకు తీసుకు రావాలన్న తలంపు వెనుక ముఖ్య కారణం నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, సన్నిహితుడు, గానగంధర్వుడు, యావత్ ప్రపంచం చేత కొనియాడబడే కీ.శే. పద్మభూషణ్ డాక్టర్ శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి హఠాన్మరణం. ఊహించని రీతిలో వారు ఈ లోకం వదలి వెళ్లడం చాలా దురదృష్టకరం. అందుకే ఈ పుస్తకంలో శ్రీ బాలు గారి గురించి ఎక్కువ భాగం రాయడం జరిగింది. ఈ పుస్తకంలోని కథలనన్నిటినీ ఓపికగా చదివి, తగు రీతి సూచనలు చేసి, తమ అమూల్యమైన అభిప్రాయం రాసిన ఆచార్య శ్రీమతి గుర్రం ఉమాదేవి గారికి హృదయపూర్వక కృతఙ్ఞతలు మరియు శుభాభినందనలు. నా ముందుటి రచనల మాదిరే ఈ పుస్తకాన్ని కూడా పాఠకులు సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ శుభాభినందనలతో……….మీ....కిషోర్ కుమార్.

Book Details

Number of Pages: 189
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

మిథునం (కథా సంపుటి)

మిథునం (కథా సంపుటి)

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book మిథునం (కథా సంపుటి).

Other Books in Humor, Entertainment

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.