You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
జీవితం లో అన్నిటికంటే భయంకరం ‘ఒంటరితనం’.
పూర్వం ఈ ఒంటరితనాన్ని జయించడానికి ఓ పెద్ద కుటుంబం ఉండేది.
ఇప్పుడు కుటుంబం అంటే నలుగురే నలుగురు. పిల్లలు వాళ్ల జీవితాల్లో బిజీగా అయిపోతారు.
పెద్దవాళ్లను ప్రతిరోజూ పలకరించే తీరిక, ఓపిక రెండూ లేకుండా పోయాయి నేటి తరానికి.
పైగా ఇద్దరూ ఉద్ద్యోగాలు చేసే ఈ రోజుల్లో ఎవరికీ వారే అనుకునే తీరు ఏర్పడింది.
ఇకపోతే మనవళ్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుల సరస్వతికి అంకితమైపోతున్నారు.
వాళ్ల జీవితాల్లో కూడా చదువు, ర్యాంకులు, జీతాలు తప్ప వేరే ప్రపంచమే లేదు.
దీంతో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో పిల్లలకు ఓ జ్ఞాపకం గాని, ఓ అనుభూతి గాని ఉండదు.
వాళ్లతో ఆడుకునే అవకాశం గాని, అవసరం గాని లేకుండాపోతుంది.
దీంతో చాలామంది పెద్దవాళ్లు నిస్సహాయంగా, నిస్సత్తువతో గడుపుతున్నారు.
చావు వస్తే బాగుంటుందని మృత్యుదేవత రాక కోసం ఎదురు చూస్తున్నారు.
వయసు మీద పడడం వాళ్ల తప్పు కాదు. వార్ధక్యం అందర్ని పలుకరించే సమయం.
అది కూడా జీవితంలో తప్పని ‘మజిలీ’. ఈ మజిలీని భారంగా, ఘోరంగా ఎంతమంది గడుపుతున్నారు నేడు.
ఎందుకంటే మెల్లిగా ‘అనవసరమైన వస్తువుల్లా’ వాళ్లను కుటుంబానికి దూరం చేస్తోంది సమాజం.
ఇకపోతే మనవళ్లు – తాతయ్య, అమ్మమ్మల మధ్య మమకారంగా పెరగే అవకాశమే లేదు.
ఎందుకంటే వాళ్లకి, మనవాళ్లకి మధ్య దూరం కూడా పెరుగుతూ వస్తోంది.
ఇలా అమ్మమ్మ, నానమ్మ తాతయ్యల ‘బంధాల గొలుసు’ తెంచేశారు.
పెద్దవాళ్ల ‘అనుభవ సారం’ మనవాళ్లకి చేరడం లేదు.
పెద్దవాళ్ల అనుభవాలు సమాజానికి ఒక ‘వనరు’గా గుర్తించడం లేదు, సరికదా!
వాళ్ల అనుభవాన్ని మనం నిరాకరించేస్తున్నాం.
వెలకట్టలేని అనుభవసారాన్ని వదిలేసే మనం రేపటి తరానికి అన్యాయం చేసినవాళ్లమవుతాం.
దానివల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతుంది.
రాబోయే తరాల్లో ‘అనుభవ లోపం లేదా అనుభవ లేమి’ జరుగి చికిత్స చేయలేని రోగంలా ఓ తరం కొట్టుమిట్టాడుతుంది.
అలాంటి ఓ తరాన్ని రక్షించే ప్రయత్నమే ఈ ‘వసంత లోగిలి’.
బంటుపల్లి శ్రీదేవి.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Vasantha Logili (వసంత లోగిలి).