You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ఈ పుస్తకం 1983,1984 ప్రాంతాల్లో ఇండియాలోనూ, స్విట్జర్లండ్ లోనూ, కాలిఫోర్నియాలోనూ యూజీ కృష్ణమూర్తి విజ్ఞాన శాస్త్రజ్ఞులతో సహా వివిధరంగాలనుంచీ వచ్చిన మేధావులతో జరిపిన సంభాషణల సంకలనం. యూజీ “The Mystique of Enlightenment, జ్ఞానోదయ రహస్యం” అనే పుస్తకానికి ఇది సహచారి గ్రంథం. దానికీ దీనికీ కొన్ని పోలికలున్నా, వీటి మధ్య తేడాలు కూడా చాలా ఉన్నాయి. మనసూ లేదు, మానసికమైనదీ లేదు, భౌతిక జీవ స్పందనలు తప్ప,.. అంటాడు యూజీ. అనుకోకుండా ఆయనలో ఒక సమూల జీవకణ పరివర్తన జరిగి ఆయనకు ప్రాప్తించిన సహజస్థితిని గురించి వివరిస్తూ యు.జి. అంటాడు, “నిజంగా ఇది అద్భుతాల్లో అద్భుతం. ఇది నిష్కారణమైనది. ఇదొక అనుభవం కాదు, అందువల్ల దీనిని యితరులకు తెలియజేయడం గానీ, మరొకరిలో జరిగేట్టు చేయడంగానీ సాధ్యంకాదు. ఈ స్థితిలో జ్ఞానేంద్రియాలు ఆలోచన యొక్క నియంత్రణ లేకుండా, వాటి పనులను అవి స్వతంత్రంగా చేసుకొంటూపోతాయ్. ఇకపై ఏ ప్రశ్నలూ లేని స్థితి యిది.” అన్నివిషయాలనూ తనదైన బాణిలో, సొంత వాణిలో, అనేక కోణాల్నించి, భౌతికజీవశాస్త్రపరంగా, అద్భుతంగా ఆవిష్కరించాడు యూజీ. విస్మయం కలిగించే విషయాలు యింకా చాలా ఉన్నాయ్ యీ పుస్తకంలో.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book మనసొక మిథ్య (Mind is a Myth).