You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
రామన్వేషణ:
తెలుగు బాషా గొప్పతనం ఎంత చెప్పుకున్న తక్కువే తెలుగు తల్లి బిడ్డలుగా పుట్టినందుకు మనందరం గర్వించాలి అందుకే ఈ కథని తెలుగుభాషకి, మన తెలుగు రచయితలకు అంకితంచేస్తున్నాను.రాముడు ఎక్కడ ఉన్నాడు?ఈ ప్రశ్న ఈనాటిది కాదు, త్రేతాయుగం నాటిది. కొందరు రాముడిని రాతి కట్టడాలలో వెతుకుతున్నారు, మరికొందరు ఆయన పేరును వ్యాపారంగా మార్చి, పవిత్రమైన క్షేత్రాల చుట్టూ భూముల అక్రమాలకు, కోట్ల రూపాయల అవినీతి స్కాములకు తెరలేపుతున్నారు. దేవుడి పేరుతో సమాజాన్ని విభజించి, స్వార్థ రాజకీయాలకు, అధికార దాహానికి వాడుకునే ఈ రోజుల్లో అసలైన ‘రామరాజ్యం’ ఎక్కడుందో వెతకడమే ఈ ‘రామాన్వేషణ’.నిజానికి రాముడు కేవలం గర్భగుడిలోని విగ్రహంలోనో, ఇటుకలు-రాళ్లతో కట్టిన కట్టడాలలోనో లేడు.రాముడు ధర్మంలో ఉన్నాడు... స్వార్థం లేని త్యాగంలో ఉన్నాడు... అన్యాయాన్ని ఎదిరించే న్యాయపోరాటంలో ఉన్నాడు... ప్రాణం పోయినా తప్పని సత్యవాక్య పరిపాలనలో ఉన్నాడు. ఈ నవలలో రాఘవరావు అనే ఒక సామాన్య రిటైర్డ్ అధికారి జీవితం ఒక పెద్ద అవినీతి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగించిన యుద్ధమే ఈ కథ. రాముడి లాంటి నిజాయితీపరుడైన తండ్రి, తన ఆత్మగౌరవాన్ని, కూతురి త్యాగానికి న్యాయాన్ని వెతుక్కుంటూ సాగించిన ప్రయాణమే ఈ ‘రామాన్వేషణ’.ప్రస్తుత సమాజంలో అధికారం, డబ్బు ఉన్నవాళ్లు చట్టాన్ని ఎలా తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారో... దేవుడి పేరు చెప్పి సామాన్యులను ఎలా మోసం చేస్తున్నారో పరోక్షంగా చూపిస్తూనే, అంతిమంగా ధర్మమే గెలుస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. ఆవేశంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కంటే, ధర్మ మార్గంలో నిలబడి శత్రువును ఉరితాడు వరకు లాగడమే అసలైన వీరత్వమని ఈ నవలలోని ప్రతి పాత్ర మనకు గుర్తు చేస్తుంది.ఈ నవల కేవలం ఒక తండ్రి కొడుకుల పోరాటం కాదు; చట్టాన్ని, వ్యవస్థను నమ్మే ప్రతి ఒక్క సామాన్యుడి ఆశ, ఆక్రోశం. భక్తి అనేది మనం బతికే నిజాయితీ గల జీవితంలో ఉందని నమ్మే ప్రతి ఒక్కరికీ ఈ ‘రామాన్వేషణ’ అంకితం.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book రామాన్వేషణ.