You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
కర్నూలు జిల్లా,బనగానపల్లె పట్టణ సమీపములో గల రవ్వలకొండపై శ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి సంకల్పబలముతో మరియు భక్తులు,సేవకులు,స్నేహితులు మొదలగు ఎందరో మహానుబావుల సహకారంతో గుడినిర్మాణము జరిగింది. శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి మూర్తి పతిష్ట వైభవముగా జరిగింది. ఇక్కడ ప్రతి స్వాతికి స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు అన్నవితరణ నిర్వహిస్తున్నారు.
ఈ రవ్వలకొండ ఎంతో పవిత్రమైనది. ఈ కొండపైననే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులు కాచుకుంటూ కాలజ్ఞానము రాశారు.
శ్రీ మహావిష్ణువు అవతారాలను స్తుతిస్తూ యాపర్లలక్ష్మీనారాయ రెడ్డి గారు "శ్రీనరసింహ సగుణమంజరి"ని రూపొందించడం జరిగింది.
ఈ "శ్రీనరసింహ సగుణమంజరి" విన్న నిత్యము పారాయణం చేసిన భక్తులందరికి సర్వపాపములు తీరి సర్వాభిష్టాలు సమకూరి సర్వశుభములు చేకూరును.
పండిత,పామర,భక్త సేవలు పొందు మహావిష్ణువు అవతారమైన నారసింహా! రవ్వలకొండను వాసము చేసుకొని మూర్తిచే(బాలిశెట్టి పావన నరసింహమూర్తి) మూర్తివైన శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా నీకు నమస్కరిస్తున్నాము
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి - సగుణమంజరి.