You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
లేఖన సత్యం మరియు వివేచన: దైవిక పునాది నుండి ప్రామాణిక
వ్యాఖ్యానం వరకు
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కేవలం మానవ ఆలోచనల సమాహారం
కాదు; అది సమస్త సృ ష్టికర్తయైన దేవుడు మానవాళి రక్షణార్థం
అనుగ్రహించిన సజీవమైన, సత్యస్వ రూపమైన వాక్యము. ఆధునిక
కాలంలో లౌకికవాదం, హేతువాదం, మరియు ఉదారవాద వేదాంత
ధోరణులు లేఖనాల ప్రామాణికతపై, చారిత్రక విశ్వసనీయతపై తీవ్రమైన
ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మరోవైపు, విశ్వాసుల మరియు
సంఘాల మధ్య లేఖనాలను తమ స్వార్థ ప్రయోజనాలకు,
భావోద్వేగాలకు అనుగుణంగా వక్రీకరించే ప్రమాదకరమైన 'ఇసజీసిస్'
(Eisegesis) ధోరణులు విస్తరిస్తున్నాయి.
ఇలాంటి సంక్లిష్టమైన సమయాన, లేఖనాలను సరైన అపోలజెటిక్
పునాదులతో సమర్థించడం మరియు ప్రామాణికమైన హెర్మెన్యూటికల్
(వివరణాత్మక) సూత్రాల ద్వారా అర్థం చేసుకోవడం ప్రతి క్రైస్తవ
విద్యార్థికి, ఉపదేశకుడికి అనివార్యమైన బాధ్యత.
ఈ సమగ్ర వేదాంత గ్రంథం రెండు ప్రధాన పునాదులపై నిర్మించబడింది:
1. మొదటి భాగం — పరిశుద్ధ గ్రంథ ఆవిర్భావ చరిత్ర మరియు
అపోలజెటిక్స్: దైవప్రేరణ సిద్ధాంతం (Inspiration), గ్రంథ
ప్రామాణికత (Canonization), వ్రాత ప్రతుల చారిత్రక భద్రత,
మరియు అంతర్గత-బహిర్గత సాక్ష్యాలను ఆధారాలతో సహా
దృఢపరుస్తుం ది.
2. రెండవ భాగం — బైబిల్ వివరణ శాస్త్రం మరియు దైవాధికార
స్థాపన: చారిత్రక-వ్యాకరణ వ్యాఖ్యాన పద్ధతులు (Historical-
Grammatical Hermeneutics), భాషా అలంకారాలు,
సాదృశ్యాలు మరియు దైవాధికార సూత్రాల ఆధారంగా లేఖనాల
మూల ఉద్దేశాన్ని నిష్పక్షపాతంగా బయటకు తీసే ('ఎగ్జిజీసి
Exegesis) మార్గాన్ని సుగమం చేస్తుం ది.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book లేఖన సత్యం మరియు దైవాధికారం.