You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
అక్షరం ఎప్పుడూ ఒక ప్రవాహం. అది మనసు పొరల్లోంచి మాటగా మారినప్పుడు ఒక తీపి అనుభూతినిస్తుంది. కానీ, కొన్ని భావాలు మాటల రూపం తీసుకోలేనంత బరువుగా ఉంటాయి. అవి పెదవి దాటలేక, గుండె లోతుల్లోనే సుడులు తిరుగుతూ ఉంటాయి. అవే నా ఈ మౌన కెరటాలు".
నా మొదటి పుస్తకం "మనసు-మాటలు" లో నన్ను నేను వెతుక్కునే ప్రయత్నం చేశాను. నాలోని భావాలను ప్రపంచానికి పరిచయం చేశాను. కానీ, కాలం గడిచేకొద్దీ మనిషికి మాటలకంటే మౌనం ఎక్కువైపోతుంది. ఆ మౌనం ఊరికే ఉండదు. అది లోపల ఒక సముద్రంలా అలజడి సృష్టిస్తుంది. ఆ నిశ్శబ్దపు సముద్రం నుంచి ఎగసిపడ్డవే ఈ కవితలు.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Mouna Keratalu.