You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
☞ ఓ పాఠకుడా…
నీవు ఈ ఒక్క పేజీ చదివితేనే, ఈ పుస్తకం ఎందుకు రాయబడిందో అర్థమవుతుంది…
భారతదేశ చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు, సామ్రాజ్యాలు, స్వాతంత్ర్య పోరాటాల చరిత్ర మాత్రమే కాదు…
చరిత్ర పుటల్లో పేర్లు కనిపించని కోట్లాది అణగారిన ప్రజల కన్నీటి కథ కూడా భారతదేశ చరిత్రే.
బ్రిటిష్ పాలనా కాలంలో భారతీయ కుల సమాజాన్ని పరిపాలనా సౌలభ్యం, సామాజిక నియంత్రణ మరియు రాజకీయ ప్రయోజనాల కోసం అనేక అధికారిక వర్గాలుగా విభజించారు.
☞ “Depressed Classes”
☞ “Exterior Castes”
☞ “Untouchable Castes”
☞ “Criminal Tribes”
ఈ పదాలు కేవలం పేర్లు కావు…
అవి కోట్లాది ప్రజల జీవితాలను, వారి సామాజిక స్థితిని, వారి భవిష్యత్తును నిర్ణయించిన అధికారిక వర్గీకరణలు.
“Depressed Classes”, “Exterior Castes”, “Untouchable Castes” అనే పదాలు ప్రధానంగా అస్పృశ్యతకు, సామాజిక బహిష్కరణకు గురైన కుల సమాజాలను సూచించగా…
“Criminal Tribes” అనే పదం ప్రధానంగా అనేక సంచార, అర్ధసంచార మరియు ఇతర కుల సమాజాలపై బ్రిటిష్ వలస పాలకులు మోపిన ఒక భయంకరమైన ముద్రగా చరిత్రలో నిలిచిపోయింది. 1871లో అమలులోకి వచ్చిన Criminal Tribes Act ద్వారా అనేక కుల సమాజాలను సమూహాలుగా నోటిఫై చేసి, వారి సంచార స్వేచ్ఛను నియంత్రించి, పోలీసు పర్యవేక్షణ మరియు తప్పనిసరి నమోదు వంటి వ్యవస్థలకు లోబరిచారు.
☞ఒక వ్యక్తి చేసిన నేరాన్ని విచారించడం కాకుండా…
మొత్తం కుల సమాజాన్నే అనుమానంతో చూడటం…
ఒక కుటుంబం గతాన్ని, వారి పిల్లల భవిష్యత్తుపై ముద్రించడం…
ఒక కుల సమాజపు గుర్తింపునే నేరంతో ముడిపెట్టడం…
ఇది వలస పాలన సృష్టించిన అత్యంత బాధాకరమైన చారిత్రక అన్యాయాలలో ఒకటి.
ఈ నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పోరాటాన్ని కేవలం “అస్పృశ్యుల హక్కుల ఉద్యమం”గా మాత్రమే చూడటం ఆయన సామాజిక న్యాయ దృక్పథం యొక్క విస్తృతిని పూర్తిగా ప్రతిబింబించదు.
ఆయన రాజకీయ, సామాజిక మరియు రాజ్యాంగ పోరాటంలో Depressed Classes, Untouchbul communitys, Exterior casts వారి హక్కులు కేంద్రస్థానంలో ఉన్నప్పటికీ, ఆయన ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు మానవ గౌరవం అనే విలువలు అణచివేతకు గురైన ప్రతి మనిషికీ సంబంధించినవి.
అంబేద్కర్ వ్యతిరేకించినది కేవలం ఒక కులంపై జరిగిన అన్యాయం మాత్రమే కాదు.
☞ఆయన ప్రశ్నించినది—
“సామాజిక బహిష్కరణ”
(Social Exclusion)
మరియు
“వారసత్వ అసమానత”
(Hereditary Inequality).
మనిషి పుట్టుక అతని గౌరవాన్ని నిర్ణయించకూడదు.
మనిషి జన్మించిన కుల సమాజం అతని అవకాశాలను మూసివేయకూడదు.
గత తరాలపై మోపబడిన అపవాదు తరువాతి తరాల భవిష్యత్తును శిక్షించకూడదు.
ఈ విశాలమైన సామాజిక న్యాయ దృక్పథంలో అస్పృశ్యతకు గురైన కుల సమాజాలు, ఆదివాసీలు, సంచార మరియు అర్ధసంచార సమాజాలు, డీ-నోటిఫైడ్ సమాజాలు (DNTs), భూమిలేని కార్మికులు మరియు ఇతర అణగారిన వర్గాల మానవ గౌరవం, సమాన అవకాశాలు మరియు హక్కుల ప్రశ్నలను అర్థం చేసుకోవచ్చు.
భారత రాజ్యాంగంలోని Articles 14–18 సమానత్వ వ్యవస్థకు పునాది వేశాయి.
Article 15 వివక్షను నిషేధించే రాజ్యాంగ రక్షణను అందించింది.
Article 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశ సమానత్వానికి రాజ్యాంగ ప్రాతిపదికను కల్పించింది.
Article 17 అస్పృశ్యతను నిర్మూలించింది.
సామాజిక న్యాయం, ప్రాతినిధ్యం, విద్యా అవకాశాలు మరియు రక్షణాత్మక వివక్షకు సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థ అణగారిన వర్గాల జీవితాల్లో ఒక కొత్త ఆశను సృష్టించింది.
అందువల్ల అంబేద్కర్ను కేవలం ఒక వర్గానికి పరిమితమైన నాయకుడిగా చూడలేం.
ఆయన పోరాటం భారతదేశంలోని చారిత్రక అసమానతను ప్రశ్నించిన పోరాటం.
మానవ గౌరవాన్ని రాజ్యాంగ విలువగా నిలబెట్టిన పోరాటం.
పుట్టుక ఆధారంగా మనిషి భవిష్యత్తును నిర్ణయించే వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటం.
అందుకే భారత సామాజిక చరిత్ర మన ముందుకు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొస్తుంది—
“వలస పాలకులు ప్రజలను పరిపాలనా వర్గాలుగా విభజించారు…
కానీ స్వతంత్ర భారత రాజ్యాంగం వారిని సమాన గౌరవం కలిగిన పౌరులుగా గుర్తించే మార్గాన్ని నిర్మించింది.”
ఇదే భారత ప్రజాస్వామ్య ప్రయాణంలోని అత్యంత గొప్ప మార్పులలో ఒకటి.
☞ ఇంకా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఇంకా ఉంది…
Criminal Tribes Act (1871–1952) ఎందుకు వచ్చింది?
దాని వెనుక ఉన్న వలస పాలనా ఆలోచన ఏమిటి?
ఈ చట్టం కింద నోటిఫై చేయబడిన కుల సమాజాలపై పోలీసు పర్యవేక్షణ ఎలా అమలైంది?
వారి సంచార స్వేచ్ఛ, సంప్రదాయ వృత్తులు, కుటుంబ జీవితం, పిల్లల భవిష్యత్తు మరియు సామాజిక గౌరవంపై ఎలాంటి ప్రభావాలు పడ్డాయి?
1952లో డీ-నోటిఫికేషన్ జరిగిన తరువాత నిజంగా వారి జీవితాలు మారిపోయాయా?
లేక…
చట్టం రద్దయినా, కుల సమాజపు అనుమానం మాత్రం కొనసాగిందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ పుస్తకంలోని అధ్యాయాల ద్వారా చారిత్రక ఆధారాలు, ప్రభుత్వ విధానాలు, కమిటీలు మరియు కమిషన్ల నివేదికలు, రాజ్యాంగ పరిణామాలు మరియు సామాజిక వాస్తవాల నేపథ్యంలో తెలుసుకుందాం.
☞ వడ్డెర కుల సమాజం
ఒక చారిత్రక ప్రయాణం — ఒక జీవన పోరాటం
ఈ పుస్తకంలో వడ్డెర కుల సమాజ చారిత్రక జీవన ప్రయాణాన్ని కూడా అధ్యయనం చేద్దాం.
స్వాతంత్ర్యానికి ముందు వారి సామాజిక, ఆర్థిక, వృత్తిపరమైన పరిస్థితులు ఎలా ఉండేవి?
వలస పాలనా విధానాలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి?
స్వాతంత్ర్యం, రాజ్యాంగం మరియు సంక్షేమ విధానాల తరువాత వారి జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది?
అనే అంశాలను పరిశీలిద్దాం.
రాళ్లు కొట్టిన చేతులకు విద్య ఎంతవరకు చేరింది?
దేశ నిర్మాణానికి శ్రమించిన కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించిందా?
వారి పిల్లలకు సమాన అవకాశాలు అందాయా?
వడ్డెర కుల సమాజ జీవన పరిస్థితులపై చరిత్ర, ప్రభుత్వ విధానాలు, కమిటీలు మరియు కమిషన్ల నివేదికలు ఏమి నమోదు చేశాయో తెలుసుకుందాం.
☞ముఖ్యంగా, Criminal Tribes జాబితాలోని వడ్డి/వడ్డెర కమ్యూనిటీ యొక్క చారిత్రక నేపథ్యం, జీవన పరిస్థితులు, సామాజిక–ఆర్థిక పరిణామాలు మరియు నేటికీ కొనసాగుతున్న సమస్యలను ఈ పుస్తక అధ్యయనం ద్వారా తెలుసుకుందాం.
ఇది కేవలం ఒక చట్టం గురించిన చరిత్ర కాదు—
ఇది గుర్తింపు, గౌరవం మరియు సామాజిక న్యాయం కోసం కొనసాగుతున్న ఒక సమాజపు జీవన పోరాటం.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book A CASE STUDY OF THE ODD / VADDI / VADDERA COMMUNITY IN THE STATES OF ANDHRA PRADESH AND TELANGANA.