You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
పోతన తెలుగు భాగవతం; సహజ కవి బమ్మెఱ పోతనామాత్యుల విరచిత 9013 పద్య /గద్యలు, 12 స్కంధాలలో విరాజిల్లే బృహత్ గ్రంథం. యథాతధ మూలపాఠం ప్రతిపదార్థ, భావాల సహితంగా ఇవ్వబడ్డాయి. అందలి 530 పద్య/గద్యలు గల ప్రథమ స్కంధం ఈ పుస్తకం. ఈ స్కంధం బృహద్గ్రంథానికి అవతారిక వంటిది.
వ్యాసుల వారికి నారదుడు శ్రీకృష్ణ పరమైన భాగవతం రచింప మనడం. ఉపపాండవులను చంపిన అశ్వత్థామ గర్వ పరిహారం. కుంతి స్థుతి. భీష్మస్థుతి. పరీక్షిత్తు జన్మము. శమీకముని పుత్రుడు శృంగి ‘ఏడురోజులలో మరణించు గాక’ అని పరీక్షిత్తును శపించడం. పరీక్షిత్తు ప్రాయోపవేశం. శుకముని వచ్చి ఏడుదినాలలో మోక్షం ప్రసాదించే భాగవతం చెప్తాను అనడం. వంటి అద్భుత ఘట్టాలు ఉన్నాయి. ‘శ్రీ కృష్ణా! యదుభూషణా!’ అమృతం లాటి పద్యాలు అనేకం ఉన్నాయి. హాయిగా ఆస్వాదించండి.
చదువుకుందాం భాగవతం.
బాగుపడదాం మనమందరం.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book 1- SK-1-Potana Telugu Bhagavatam - First Skandham :: 1- పోతన తెలుగు భాగవతము - ప్రథమ స్కంధము..