You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
“అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను ను, నీవు పంపిన యేసుక్రీస్తును
ఎరుగుటయే నిత్యజీవము.”
— యోహాను 17:3
1. తండ్రిని ఎరుగుట – ఒక ఆహ్వానం
ఒక బిడ్డ తన తండ్రి పేరు తెలుసుకున్నం త మాత్రాన అతనిని ఎరిగినట్లు కాదు.
తండ్రితో కలిసి భోజనం చేసి, అతని స్వ రం విని, అతని ఆశలను, అతని చిత్తాన్ని
అర్థం చేసుకున్న ప్పుడే ఆ బిడ్డ తన తండ్రిని నిజంగా ఎరుగుతాడు. క్రైస్తవులమైన
మనము కూడా పరలోకపు తండ్రిని ఇలాగే ఎరుగాలని ఆయన కోరుతున్నాడు.
అందుకే యేసు ప్రభువు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతూ, “పరలోకమందున్న మా
తండ్రీ” అని సంబోధించమని బోధించాడు (మత్తయి 6:9).
యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినది తండ్రిని మనకు ప్రత్యక్షపరచడానికే. ఎవడును
ఎప్పుడును దేవుని చూడలేదు; తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే
ఆయనను తెలియజేసెను (యోహాను 1:18). “నన్ను చూచినవాడు తండ్రిని
చూచియున్నాడు” అని ప్రభువు చెప్పాడు (యోహాను 14:9). ఈ పుస్తకం మనకు
క్రీస్తు ద్వారా, లేఖనాల ద్వారా తండ్రిని లోతుగా పరిచయం చేయడానికి
రూపొందించబడింది.
నేడు చాలా సమూహాలలో దేవుని గురించి అసమతుల్యమైన బోధలు
వినిపిస్తున్నాయి. కొందరు ఆయన ప్రేమను మాత్రమే నొక్కి చెప్పి, ఆయన
పరిశుద్ధతను, న్యాయాన్ని విస్మ రిస్తారు. మరికొందరు ఆయన కఠినత్వాన్ని
మాత్రమే చూపించి, ఆయన కనికరాన్ని మరుగుపరుస్తారు. అయితే లేఖనం
మనకు సంపూర్ణ చిత్రాన్ని ఇస్తుం ది: “దేవుని అనుగ్రహమును కాఠిన్య మును చూడుము” (రోమా 11:22). తండ్రిని ఆయన తనను గూర్చి చెప్పినంతగానే
ఎరుగాలనేది మన ఆశయం, అంతకు ఎక్కు వా కాదు, తక్కు వా కాదు
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book పరలోకపు తండ్రి.